లోక్‌సభలో ఎంపీల ఆందోళన

ఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు ఆందోళనను కొనసాగిస్తున్నారు. గురువారం లోక్‌సభలో ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. హోదా అంశంపై చర్చించాలని వాయిదా తీర్మానం ఇచ్చినా స్పందించకపోవడంతో ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. సభ్యుల ఆందోళనతో లోక్‌సభను స్పీకర్‌ వాయిదా వేశారు. చంద్రబాబుకు స్వార్ధం తప్ప రాష్ర్ట ప్రయోజనాలు పట్టవని విమర్శించారు. హోదా అంటే జైలుకే నంటూ బెదిరించడంతో పాటు హోదా ముగిసిన అథ్యాయమని అన్నారని గుర్తుచేశారు. తమ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ పోరాటంతో చంద్రబాబు యూటర్న్‌ తీసుకున్నారన్నారు. హోదా సాధించేందుకు వైయస్‌ఆర్‌సీపీ  ఎంతవరకైనా వెళుతుందని స్పష్టం చేశారు. 
 
Back to Top