ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా సాధన కోసం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పార్లమెంట్‌లో పోరాటం కొనసాగిస్తున్నారు. హోదా అంశంపై చర్చించాలంటూ వైవీ సుబ్బారెడ్డి లోక్‌సభలో వాయిదా తీర్మానం ఇచ్చారు. అదేవిధంగా వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి రాజ్యసభలో కాలింగ్ అటెన్షన్ నోటీసు ఇచ్చారు. ఎలాగైనా రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావాలని వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు పార్లమెంటు మెయిన్ గేట్ వద్ద ధర్నా చేస్తున్నారు. ఆందోళనలో ఎంపీలు మేకపాటి, వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి, వరప్రసాద్‌లు పాల్గొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ నినాదాలు చేస్తున్నారు. ఏపికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. <br/><br/>