సభ సజావుగా సాగేందుకు సహకరించాలి

ఢిల్లీ: లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం జరిగేందుకు అన్ని పార్టీల సభ్యులు సభ సజావుగా సాగేందుకు సహకరించాలని వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కోరారు. అవిశ్వాస తీర్మానంపై మరోమారు లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు ఆయన నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ప్రజా స్వామ్యానికి తూట్లు పొడిచారని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం మేం పోరాడుతుంటే చంద్రబాబు అణగదొక్కడానికి కుట్రలు చేశారని మండిపడ్డారు. గత మూడు సార్లు సభ ఆర్డర్‌లో లేదని వాయిదా వేశారని, ఈ రోజైనా అవిశ్వాస తీర్మానంపై చర్చ నిర్వహించాలని ఆయన కోరారు. సభ సజావుగా సాగేందుకు అన్ని పార్టీలు సహకరించాలని వైవీ సుబ్బారెడ్డి కోరారు.
 

తాజా ఫోటోలు

Back to Top