చింతమనేని దోపిడీలో చంద్రబాబుకూ భాగం

అందుకే చర్యలు తీసుకునేందుకు వెనకడుగు
ప్రజలకు అండగా ఉండాల్సిన అధికారులు బాబుకు తొత్తులయ్యారు
టీడీపీ దోపిడీని అడ్డుకునేందుకు ఎంతటి పోరాటానికైనా సిద్ధం
పశ్చిమగోదావరి: దోపిడీలో చంద్రబాబుకు భాగం ఉంది కాబట్టే చింతమనేనిపై చర్యలు తీసుకోవడం లేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ధ్వజమెత్తారు. పశ్చిమగోదావరిలో అధికారులు శాసనసభ్యులకు, ముఖ్యమంత్రికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ దెందులూరు సమన్వయకర్త అబ్బాయ్‌చౌదరి చేపట్టిన దీక్షకు వైవీ సుబ్బారెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రశ్నించేవారిపై కేసులు పెట్టి న్యాయస్థానాలకు వెళ్లినా భయపడమనే రీతిలో అధికారుల వైఖరి ఉందన్నారు. పదవులు శాశ్వతం కాదు.. ప్రజలకు మేలైన కార్యక్రమాలు అందే విధంగా వారికి అండగా అధికారులు ఉండాలన్నారు. పశ్చిమగోదావరిలో వరదలతో ప్రజలు అనేక ఇబ్బందులకు గురయితే.. తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణరావు బాధితుల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఆయనపై కేసులు పెట్టారని గుర్తు చేశారు. దెందులూరు నియోజకవర్గంలో దోపిడీ విచ్చలవిడిగా ఉందన్నారు. తహసీల్దార్‌ను ఇసుకలో పడేసి కొట్టినా టీడీపీ ఎమ్మెల్యే చింతమనేనిపై చర్యలు తీసుకోలేదన్నారు. దోపిడీని అన్ని విధాలుగా వైయస్‌ఆర్‌ సీపీ అడ్డుకుంటుందని, ఎన్నిపోరాటాలకైనా సిద్ధంగా ఉన్నామన్నారు. ఎటువంటి కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదన్నారు. టీడీపీ నేతల దోపిడీ ప్రజలందరికీ వివరిస్తామని చెప్పారు. దోపిడీకి సహకరించిన అధికారులపై కూడా న్యాయస్థానాలను ఆశ్రయిస్తామన్నారు. అబ్బాయ్‌చౌదరి దీక్ష ముగిసే లోపు ప్రభుత్వం దిగివచ్చి చింతమనేనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 
అబ్బాయ్‌చౌదరి ఘనవిజయం సాధిస్తారు..
పది నెలలుగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్పయాత్ర ద్వారా రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీని వివరిస్తున్నారు. ఏ జిల్లాలో ఎటువంటి కార్యక్రమాలు జరుగుతున్నా.. అవన్నీ వైయస్‌ జగన్‌ దృష్టిలో ఉంటాయని చెప్పారు. ఎట్టి పరిస్థితిల్లో ఏ కేసులకు భయపడాల్సిన అవసరం లేదని, తెలుగుదేశం ప్రభుత్వం చేసే ప్రతీ అక్రమాన్ని వెలుగులోకి తీసుకురావాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాబోయే కాలంలో వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రావడమే కాదు.. దెందులూరులో వైయస్‌ఆర్‌ సీపీ అభ్యర్థి అబ్బాయ్‌చౌదరి ఘనవిజయం సాధిస్తారన్నారు. ప్రజా ప్రభుత్వం వచ్చిన తరువాత దోపిడీకి పాల్పడిన వారిపై విచారణలు జరిపించి చట్టపరమైన శిక్ష పడేలా చేస్తామన్నారు. 
Back to Top