వైయస్‌ కుటుంబంపై అభిమానంతో పిలిచాం


వైయస్‌ఆర్‌ జిల్లా: దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి కుటుంబంపై అభిమానంతో రిసెప్షన్‌కు పిలిచామని, మా అనుమతి లేకుండా పిలుస్తావా అంటూ మంత్రి ఆదినారాయణరెడ్డి వర్గీయులు దాడి చేశారని దళిత సామాజిక వర్గానికి చెందిన సంపత్‌ తెలిపారు. తన కుటుంబానికి రక్షణ కల్పించాలని సంపత్‌ డీఎస్పీని కోరారు. కులం పేరుతో దూషించి తనపై దాడి చేశారని దళితుడు సంపత్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
Back to Top