‘హోదా భిక్ష కాదు.. 5 కోట్ల ఆంధ్రుల హక్కు’

 
న్యూఢిల్లీ : ‘హోదా భిక్ష కాదు.. 5 కోట్ల ఆంధ్రుల హక్కు’అని వైయ‌స్ఆర్ సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, రాజ్య‌స‌భ స‌భ్యులు విజ‌య‌సాయిరెడ్డి అన్నారు. 
ఐదుకోట్ల ఆంధ్రులకు అపర సంజీవని వంటి ప్రత్యేక హోదా సాధన కోసం వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఢిల్లీ వేదికగా త‌ల‌పెట్టిన మ‌హాధ‌ర్నాలో విజ‌య‌సాయిరెడ్డి పాల్గొని ప్ర‌సంగించారు. విభ‌జ‌న చ‌ట్టంలోని హామీల‌ను నెర‌వేర్చ‌డంలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌న్నారు. ప్ర‌త్యేక హోదా సాధ‌న‌కు వైయ‌స్ జ‌గ‌న్ నాలుగేళ్లుగా పోరాటం చేస్తున్నార‌ని గుర్తు చేశారు. చంద్ర‌బాబు ప్ర‌త్యేక హోదాపై ఊస‌ర‌వెళ్లిలా మాట‌లు మార్చుతూ..రోజుకో మాట మాట్లాడుతున్నార‌ని మండిప‌డ్డారు. ఇవాళ అసెంబ్లీలో గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగంలో ప్ర‌త్యేక హోదాపై కంటి తుడుపు చ‌ర్య‌గా చేర్చార‌ని, దాని వ‌ల్ల ప్ర‌యోజ‌నం లేద‌న్నారు. ప్ర‌త్యేక హోదా సాధ‌న‌కు టీడీపీలో చిత్త‌శుద్ది లేద‌న్నారు. హోదా ఇవ్వ‌క‌పోతే పార్ల‌మెంట్ స‌మావేశాల‌ను స్థంబింప‌జేస్తామ‌ని హెచ్చ‌రించారు. 

Back to Top