ఏపీలో దోచుకున్న ప్రజల సొమ్ము ఇతర రాష్ట్రాలకు తరలింపు..హిమాలయాల అంచులకు చంద్రబాబు అవినీతి..విశాఖపట్నంఃవర్తమాన రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం,కా్రంగెస్‌కు ఉన్న సంబంధం, డీల్ ఏమిటనేది ఆంధ్ర ప్రజలు తెలుసుకోవాలని వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సూచించారు. విశాఖపట్నంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో కర్ణాటక ఎన్నికలు జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీల టూరిస్ట్ బస్సుల్లో ఎన్ని వందల కోట్లు తరలివెళ్ళాయో గమనించాలన్నారు. ప్రస్తుతం తెలంగాణ ఎన్నికలో 119 ఎన్నికల్లో ఒక్కొ నియోజకవర్గానికి 10 కోట్లు చొప్పన 1200 కోట్లు చంద్రబాబు ఫడింగ్ చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రచారంలో చంద్రబాబు ఫోటో పెద్దగా కనబడుతోందని, రేవంత్ రెడ్డిని ముందుగా ఆలోచించి కాంగ్రెస్‌కు ఎందుకు పంపించాడో ప్రజలు అందరూ అర్థంచేసుకోవచ్చన్నారు. రాజస్థాన్,మధ్యప్రదేశ్‌లో ఎన్నికల్లో 500 కోట్లు ఒకొక్క రాష్ట్రానికి పంపించినట్లు చాలా రాజకీయ పార్టీలకు తెలుసు అన్నారు. రాబోయే 2019 సార్వత్రిక ఎన్నికలో జాతీయ వాటా కింద పంపించారని విమర్శించారు.
టీడీపి,కాంగ్రెస్ ఉన్న బంధం దృష్ట్యా 5వేల కోట్లు ఇవ్వడానికి రాహుల్‌గాంధీకి చంద్రబాబు ప్రామిస్ చేశాడని స్పష్టమవుతోందన్నారు. రాజధాని విషయంలో జివో 22, పుష్కరాల్లో ఐటి సంస్థలు,భూ కుంభకోణాలు, ఇసుకదోపిడీ, ఉపాధిహామీ, చంద్రన్న కానుక వంటి ద్వారా గత నాలుగున్నర సంవత్సరాలుగా రూ.4 లక్షల కోట్ల ప్రజల సొమ్మును దోచుకున్న విషయం ఏపీ ప్రజలకు తెలుసు అన్నారు. ఆంధ్రరాష్టంలో దోచుకున్న సొమ్మును మిగతా రాష్ట్రాల్లో ఎన్నికలకు, ఆంధ్రలో రాబోయే ఎన్నికలు ఖర్చుచేస్తున్నారన్నారు. చంద్రబాబు నంద్యాల ఉప ఎన్నికల సమయంలో ఒక విషయం బయటపెట్టాడు. 2019లో జరిగే ఎన్నికలో ఒకొక్క ఓటుకు 5 వేల రూపాయలు ఇస్తానని చెప్పారన్నారు. రాష్ట్రంలో ఉన్న 3 కోట్ల జనాభాలో దాంట్లో 2కోట్ల 50 లక్షలు ఓటు వేసినకూడా 15వేల కోట్లు రూపాయలు పంపిణీ చేయడానికి చంద్రబాబు సిద్ధంగా ఉన్నారని స్పష్టమవుతోందన్నారు. రాష్ట్రాన్ని ఏవిధంగా దోచుకుంటున్నారేది స్పష్టంగా కనబడుతోందన్నారు. తన ఖర్చుపెట్టదలుచుకున్న 15వేల కోట్లు రూపాయలు ఏ రోజు ఎక్కడి ఏ వాహనం దారా ఎక్కడకు తరలించపోతున్నారు అనే విషయం చెప్తాను.
పప్పు నాయుడుతో ఉన్న రాజేష్,శ్రీనివాస్,ఎవరికి తెలియని అజా›్ఞత వ్యక్తి గోపీ, యరపతినేని శ్రీనివాçసరావు, సుబ్బారావులు డబ్బును ఎక్కడి తరలిస్తారు. ఎలా ఖర్చుపెడతారు అనేది చెప్తానన్నారు. మీ సొమ్మును మీరే తీసుకోండిని ప్రజలకు సూచించారు.ఏపీ ప్రజలకు అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీతో జతకట్టడం ఎంత దుర్మార్గ చర్య అని అన్నారు. చంద్రబాబుకు నాలుగు నాలుకలు కాదు. పది నాలుకలు వున్నాయి. ఏపీలో 23 మంది వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ద్రోహం,దుర్మార్గం చంద్రబాబు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజలందరూ అమాయకులు అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. చంద్రబాబు అవినీతిలో హిమాలయాల అంచులకు వెళ్ళాడని ఎద్దేవా చేశారు.. గతంలో ఎన్నో ప్రభుత్వాలను చూశాం.ప్రభుత్వ పనుల్లో ఏకంగా 40 శాతం రేటు పిక్స్ చేసిన దుర్మార్గపు ముఖ్యమంత్రి చంద్రబాబు అని అన్నారు. నీతిమంతుణ్ణి అని, 40 ఏళ్లు అనుభవం ఉందని చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటాడరన్నారు. ఎంతడబ్బు అయినా ∙ఖర్చుపెట్టి తిరిగి అధికారంలోకి రావాలని చంద్రబాబు నమ్ముతున్నాడరన్నారు. ఎంత మాత్రం వీలుపడదని, ఆంధ్రరాష్ట ప్రజలందరూ టీడీపీకి వ్యతిరేకంగా వున్నారని, .డబ్బుతో ఓట్లును కొని రాజకీయం చేసే పరిస్థితి ఉండదన్నారు..
2013లో చంద్రబాబు ఒక విషయం చెప్పారు.. అవినీతిపరులంతా కాంగ్రెస్ పంచన చేరతారని, ఆ రోజు కరెక్ట్‌గానే చెప్పారు. నేడు అవినీతి పరుడైన నిప్పు నాయుడు రాహుల్ పంచన చేరారు. ఇది చంద్రబాబు నీతి అని అన్నారు. ప్రత్యేకహోదాపై వైయస్‌ఆర్‌సీపీ గత నాలుగున్నర సంవత్సరాలుగా పోరాటం చేసి, వైయఆర్‌సీపీ ఎంపీలంతా రాజీనామాలు చేస్తే ,టీడీపీ ఎంపీలు మాత్రం గబ్బిలాలు లాగా పదవులను అట్టిపట్టికుని ఉన్నారని మండిపడ్డారు. రాష్ట్ర సమస్యలను గాలికొదిలేసి తెలంగాణలో ఈగలు తోలుకునే సభలను పెట్టుకుంటాడన్నారు. విజయవాడలో నాలుగు సంవత్సరాలుగా బ్రిడ్జి కట్టలేని వ్యక్తి హైదరాబాద్‌ను నేనే కట్టానంటాడు..శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ను నేనే కట్టానంటాడు. చంద్రబాబు మాటలను నమ్మొదని ప్రజలకు సూచించారు. వైయస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నాన్ని చిన్నబుచ్చడానికి కోడికత్తి చంద్రబాబు కోడికత్తి అని హేళనగా మాట్లాడరని, చంద్రబాబు కోడికత్తితో అర అంగుళం గొంతుకు కోసుకుంటే అర్థమవుతోందన్నారు.
టీడీపీకి రాబోయే ఎన్నికల్లో ప్రజలందరూ బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. మంచి పార్టీ, ప్రజలకు ప్రయోజనాలు చేకూర్చే మంచి మనసున వ్యక్తి వైయస్ జగన్‌మోహన్ రెడ్డి అని, ఆయనకు అవకాశం ఇవ్వాలని కోరారు. జనసేన కూడా టీడీపీ వైపు మొగ్గుచూపుతోందని, ఎదో ఒక సినిమా డైలాగు చెప్పి ప్లీనరీలో పవన్‌కల్యాణ్ చంద్రబాబు నాయుడిని విమర్శించారు. కాని నేడు గతంలో లాగానే 2014 ఎన్నికల్లో డబ్బులు తీసుకుని ఏవిధంగా కాల్షిట్లు ఇచ్చాడో 2019 ఎన్నికల్లో కూడా పవన్‌కల్యాణ్ చంద్రబాబుకు అమ్ముడుబోతున్నాడని స్పష్టమవుతోందన్నారు. ఈ మధ్య ప్రకటనలు చూస్తే పొంతన ఉండటంలేదన్నారు. జనసేనకు కూడా ప్రజలు బుద్ధి చెప్పాలని ఏపీ ప్రజలకు పిలుపునిచ్చారు.