నిరుద్యోగులను నిలువునా ముంచాడు

ఉద్యోగ సంఘాలను తీవ్రంగా వేధిస్తున్నాడు
డీఎస్సీ పేరుతో మరో కొత్త మోసానికి తెరతీశాడు
చంద్రబాబుకు ఎన్నికల్లో గుణపాఠం తప్పదు
వైయస్‌ జగన్‌ సీఎం కాగానే సీపీఎస్‌ రద్దు చేస్తాం
విజయవాడ: ఇంటికో ఉద్యోగం, భృతి పేరుతో చంద్రబాబు నిరుద్యోగులను నిలువునా ముంచాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి ధ్వజమెత్తారు. అబద్ధపు హామీలతో ఉద్యోగులను, నిరుద్యోగులను రోడ్డున పడేశాడని మండిపడ్డారు. విజయవాడ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో వెన్నపూస గోపాల్‌రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 23 వేల టీచర్స్‌ ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉంటే కేవలం 7 వేల పోస్టులకు మాత్రమే డీఎస్సీ నిర్వహిస్తున్నాడన్నారు. 2014లో చంద్రబాబు 630 అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చాడన్నారు. వాటిల్లో ఒక్కటి కూడా నెరవేర్చిన పాపానపోలేదన్నారు. సీపీఎస్‌ విధానంపై ఉద్యోగ సంఘాలు చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయన్నారు. వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయిన వెంటనే సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేసిన ఓపీఎస్‌ అమలు చేస్తామని ఉద్యోగ సంఘాలకు భరోసా ఇచ్చారు. 

ఉదయం లేచింది మొదలు చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలేనని ఎమ్మెల్సీ గోపాల్‌రెడ్డి అన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో లక్షలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా భర్తీ చేయడం లేదని మండిపడ్డారు. రైన్‌ గన్స్‌ పేరుతో కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ నాయకులు దోచుకున్నారన్నారు. చంద్రబాబు ఇకనైనా అబద్దాలు మాని పాలనపై దృష్టి పెట్టు, లేదంటే ప్రజలే తగిన గుణ పాఠం చెబుతారని హెచ్చరించారు. 
 
Back to Top