వైఎస్సార్సీపీ ఆందోళన

హైద‌రాబాద్‌: అసెంబ్లీ లో ప్రజాస్వామ్యానికి పాతర వేయటానికి చేస్తున్న ప్రయత్నాల మీద వైఎస్సార్సీపీ మండిపడుతోంది. ఇందుకు నిరసనగా అసెంబ్లీ దగ్గర ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యేలతో కలిసి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ గవర్నర్ కు ఫిర్యాదు చేయటానికి బయలుదేరారు. 

ఎమ్మెల్యే రోజాను క‌నీసం ఎల్పీ కార్యాల‌యంలోకి కూడా అనుమ‌తించ‌రా
అని ప్ర‌తిప‌క్ష వైఎస్ జ‌గ‌న్ ప్ర‌శ్నించారు. ఒక వేళ అలా అనుమతి లేదని స్పీకర్
ఆదేశాలు రాతపూర్వకంగా ఉంటే చూపించండి అంటూ ఆయన నిలదీశారు. 

కోర్టు ఉత్తర్వుల అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా అసెంబ్లీకి
రావ‌డంతో ఆమెను సభలోకి అనుమతించబోమంటూ చీఫ్ మార్షల్ అడ్డుకున్నారు. అక్క‌డికి వ‌చ్చిన
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చీఫ్ మార్షల్ తీరుపట్ల మండిపడ్డారు. ఎమ్మెల్యేలను
రోడ్డుమీద నిలబెడతారా అని నిల‌దీశారు. స్పీకర్ ఆదేశాలు చూపించేవరకు తమ ఎల్పీ
ఆఫీసులోకి అనుమతించండి కోరారు. తన కార్యాలయంలోకి   తీసుకెళతానని, తన పాస్ కూడా ఇస్తానని చెప్పారు. తనకు
ఎవరినైనా తీసుకెళ్లే హక్కు ఉందని వైఎస్ జగన్ మార్షల్స్ కు చెప్పారు.    

ఇంకా ఎవరేమన్నారంటే..


'కోర్టు ఇచ్చిన నిర్ణయాలను కూడా తుంగలోకి తొక్కి, ఎమ్మెల్యే రోజాను అడ్డుకోవడం హేయమైన చర్య. ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కుతోంది. నియోజకవర్గ ప్రజాసమస్యలు వినిపించేందుకు వెళ్లొచ్చని హైకోర్టు చెప్పినా, అడ్డుకుంటున్నారు. సభ లోపల, బయట ప్రతిపక్షం గొంతు ఎలా నొక్కుతున్నారో స్పష్టంగా కనిపిస్తోంది.
-చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి

చంద్రబాబు, స్పీకర్ తమ ఇష్టం వచ్చినట్లు ఎమ్మెల్యేను అడ్డుకుంటున్నారు. కనీసం ఎల్పీ ఆఫీసు వరకు వెళ్లేందుకు కూడా వీల్లేకుండా అడ్డుకుంటున్నారు. హైకోర్టు ఉత్తర్వులను కూడా కాదనడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే.
-ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే)

'చాలా దుర్మార్గంగా చేస్తున్నారు. కోర్టు ఆర్డర్ తీసుకొచ్చినా కూడా లోపలకు పంపకుండా అడ్డుకుంటున్నారు. అందుకే పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మేం అందరం కూడా అసెంబ్లీ బయటే బైఠాయించాం
- ఎమ్మెల్యే ప్రతాపరెడ్డి

వీరితో పాటు వైఎస్ఆర్‌సీపీకి చెందిన గిరిజన ఎమ్మెల్యే పీడిక రాజన్న దొర కూడా ఇదే అంశంపై మాట్లాడుతుండగా పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. ఆయనను పక్కకు నెట్టేయడంతో పాటు మీడియాను కూడా లాగేశారు. కనీసం ఆయనను మాట్లాడేందుకు కూడా అనుమతించలేదు.
Back to Top