రాష్ట్రంలో ఏ ఒక్కరికీ రక్షణ లేదు

తిరుపతి: చంద్రబాబు పాలనపై వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. రాష్ట్రంలో ఏ ఒక్కరికి రక్షణ లేకుండా పోయిందని ఆమె ధ్వజమెత్తారు. కేబినెట్‌ హోదాలో ఉన్న ఎమ్మెల్యేనే చంపారని, అమెరికా వెళ్లిన చంద్రబాబు వ్యవసాయం మీద మాట్లాడటం దారుణమన్నారు. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబుకు వ్యవసాయం గురించి మాట్లాడే అర్హత లేదని విమర్శించారు. వైయస్‌ జగన్‌ సీఎం కావాలని అన్ని ప్రాంతాల ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. 
 

తాజా ఫోటోలు

Back to Top