మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా వినూత్నంగా నిసన తెలిపారు. రాజధాని ప్రతిపాదిత ప్రాంతంలో పంటలు వేయవద్దని ప్రభుత్వం చేసిన ప్రకటనను వ్యతిరేకిస్తూ ఆయన ఆ ప్రాంతంలో పూలు కోసి నిరసన తెలిపారు. కురగల్లు, నిడమర్రు, పెనుమాక, ఉండవల్లి గ్రామాల్లోని పంటపొలాల్లో రైతులతో కలిసి ఆయన పర్యటించారు. ఆయన వెంట మంగళగిరి ఎంపీపీ పచ్చల రత్నకుమారి, వై ఎస్సార్సీపీనాయకులు మర్రెడ్డి శ్రీనివాస రెడ్డి తదితరులు ఉన్నారు.<br/>