10న విశాఖలో బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనం

ముఖ్యఅతిథిగా హాజరుకానున్న ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌
విశాఖపట్నం: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీన విశాఖలో జరిగే బ్రాహ్మణ ఆత్మీయ సదస్సును విజయవంతం చేయాలని బాపట్ల నియోజకవర్గ వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి పిలుపునిచ్చారు. విశాఖ జిల్లా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో బ్రాహ్మణులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. టీడీపీ హయాంలో బ్రాహ్మణులకు ఒరిగిందేమీ లేదన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యే ఈ సభకు బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన పెద్దలు, ప్రముఖులు, మేధావులు, ప్రజలు హాజరుకావాలని కోరారు. విశాఖపట్నంలోని సిరిపురం ఏరియాలో మధ్యాహ్నం 3 గంటలకు ఆత్మీయ సమావేశం ఉంటుందన్నారు. సమావేశం వైయస్‌ జగన్‌ ప్రజలతో ముఖాముఖి నిర్వహిస్తారని, సమస్యలు తెలుసుకొని వాటికి పరిష్కార మార్గాలు, అధికారంలోకి వచ్చాక చేయబోయే కార్యక్రమాలను వివరిస్తారన్నారు. 
 
Back to Top