సంక్షేమ ఫలాలు పచ్చచొక్కాల జేబుల్లోకే...

శ్రీకాకుళంః దివంగత మహానేత వైయస్‌ఆర్‌ హయాంలో సంక్షేమ ఫలాలు ప్రజలందరికి అందాయని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కళావతి అన్నారు. టీడీపీ పాలనలో కనీస ప్రజలకు కనీస సౌకర్యాలు కూడా అందడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తోటపల్లి,వంశధార ప్రాజెక్టులకు ఆద్యుడు వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి అని అన్నారు. వైయస్‌ జగన్‌ అధికారంలోకి వస్తే మళ్లీ రాజన్న పాలన వస్తుందన్నారు.శ్రీకాకుళం జిల్లాలో ఉన్న సమస్యలన్నీ జననేత దృష్టికి తీసుకెళ్తున్నట్లు తెలిపారు.పేదల అభ్యున్నతికి పాటుపడేది ఒక జగన్‌మోహన్‌ రెడ్డి ఒకరేనని అన్నారు. వైయస్‌ జగన్‌ అందరి సమస్యలు ఓపికగా వింటూ భరోసా ఇస్తున్నారన్నారు.వైయస్‌ఆర్‌ తనయుడుగా వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై ప్రజలందరూ ప్రగాఢ విశ్వాసంతో ఉన్నారని, మాట తప్పని,మడం తిప్పని నేతగా ప్రజలందరూ భావిస్తున్నారన్నారు.నేడు పాలకొండలో జరగబోయే భారీ బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ ప్రసంగంపై ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారన్నారు.చెరువులు,గెడ్డలు బాగుచేస్తామని చెప్పి నీరు–చెట్టు పథకం పేరుతో నిధులను దోపిడీ చేస్తున్నారన్నారు. పచ్చచొక్కాలు జేబులు నింపుకుని స్వార్థ రాజకీయాలకు చేస్తున్నారని మండిపడ్డారు.తిత్లీ తుపాను బాధిత ప్రాంతాలను కూడా గుర్తించకుండా తీవ్ర అన్యాయం చేశారన్నారు.
 
Back to Top