కట్టు కథలు.. ఆడంబరాలు..

ఈ నాలుగున్నరేళ్లలో చంద్రబాబు సాధించింది ఇదే...
హైదరాబాద్‌ను కట్టిన చంద్రబాబుకు..
రాజధాని నిర్మాణం ఎందుకు చేతకావడంలేదు..
చంద్రబాబు పాలనలో అప్పులు పెరిగిపోయాయి..
కేంద్రం నిధులపై లెక్క తేల్చాలి..

హైదరాబాద్ః అమరావతిని నిర్మించినట్లు చంద్రబాబు  మీడియాలో కట్టు కథలను ప్రచారం చేయిస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ బుగ్గన రాజేందర్‌ ధ్వజమెత్తారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌ను కట్టించింది కూడా నేనేనంటూ చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారని. తొమ్మిది సంవత్సరాల్లో హైదరాబాద్‌ను కట్టించిన చంద్రబాబు.. ఐదు సంవత్సరాల్లో అమరావతిని కనీసం ఒక శాతం కూడా ఎందుకు కట్టలేదని పశ్నించారు. ఎయిర్‌ షోలో పైలంట్‌ అయ్యి ఉంటే బాగుండేందని,  కలెక్టర్ల కన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ అయ్యి ఉంటే బాగుండేందని చంద్రబాబు విచిత్రంగా మాట్లాడుతూ ఉంటారన్నారు. రాజధానిని  కేంద్రం సహకారం లేకపోవడం వల్లనే  కట్టలేకపోతున్నారని చంద్రబాబు  చెప్పుతున్నారని,  గతంలో బీజేపీ ఒడిలో కూర్చోన చంద్రబాబు ఇప్పుడు కాంగ్రెస్‌ ఓడిలో కూర్చుని  బీజేపీని విమర్శిస్తూ ధర్మపోరాట దీక్షలంటూ తమ అనుకూల మీడియాతో ప్రచారం చేయించుకుంటున్నారన్నారు. రామాయణం అంతా వెతికామని, రాముడు వైపు  కొంతకాలం, రావణుడు వైపు కొంతకాలం  ఎవరైనా ఉన్నారా అని, ఎవరు కనబడలేదన్నారు. మహాభారతం కూడా చూస్తే..సగ భాగం కౌరవులు దగ్గర, సగభాగం పాండవులు దగ్గర ఎవరైన ఉన్నారా అని ఎవరూ కనబడలేదన్నారు. 

మొదటి ప్రపంచం యుద్ధం చూస్తే సగ భాగం బ్రిటిష్‌ వారి పట్ల..సగ భాగం అపోజిట్‌లో చూస్తే ఎవరు కనబడలేదన్నారు.రెండవ ప్రపంచం చూస్తే ఎక్కడ కనబడడంలేదు. చంద్రబాబు మాత్రం  బ్రహ్మండంగా మేనేజ్‌ చేస్తున్నారని ఛలోక్తులు విసిరారు. తెలంగాణ సభలో సోనియాగాంధీ మాట్లాడుతూ తెలంగాణ నా మూడో బిడ్డ అని అన్నారని, ఆంధ్రప్రదేశ్‌కు విభజనకు కారణం ఎవరని, .కాంగ్రెస్‌ పార్టీ కాదా అని ప్రశ్నించారు. నేడు చంద్రబాబు కాంగ్రెస్‌పార్టీతో కలిసి చారిత్మ్రాక అవసరం అంటున్నారన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పుటి నుంచి  16వేల కోట్లు లోటు బడ్జెట్‌లో ఉందని చంద్రబాబు చెప్పారని,  కేంద్రం పూర్తిగా ఇవ్వలేదన్నా చంద్రబాబు.. కేంద్రంతో భార్యభార్తల్లా నాలుగు సంవత్సరాలు కలిసే ఉన్నారు కాదా ఎందుకు సాధించలేకపోయారని ప్రశ్నించారు. పెన్షన్‌ స్కీం పెంపు, రుణామాఫీ ఖర్చు అందులో చూపించుకున్నారని, ఇది లోటు బడ్జెట్‌ కింద రాదంటూ కేంద్రం చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్వివ్యవస్థీకరణ చట్టం ప్రకారం పోలవరం నిర్మించాల్సింది కేంద్రం అని అన్నారు.  కమీషన్లు దండుకోవడానికి,బినామీలకు కాంట్రాక్టులు ఇవ్వడానికి చంద్రబాబు తీసుకున్నారని దుయ్యబట్టారు. 17 వేల  కోట్లతో ఏపీలో అన్ని సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేస్తామని చెప్పి నేడు  58 వేల కోట్లు అయ్యిందని టీడీపీ ప్రభుత్వం చెప్పుతుందన్నారు.  

40 వేల కోట్లతో పోలవరం ప్రాజెక్టుతో పాటు అన్ని నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేస్తామని టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిందని దీనికి సమాధానం చెప్పాలన్నారు. అమరావతి బాండ్లలో మొదటి ఫేజ్‌లోనే 48 వేల కోట్లు,  రెండో ఫేజ్‌లో లక్షల కోట్లు కావాలంటున్నారన్నారు. సరైన అంచనాలు లేకుండా మాట్లాడుతున్నారన్నారు. ఒక పక్క లక్షల కోట్లు అంటున్నారు. మరో పక్క 2500 కోట్లులో 15 వందల కోట్లు ఇచ్చారు.. 1000 కోట్లు కావాలనటం  అశ్చర్యకరంగా ఉందన్నారు. అమరావతి బాండ్ల పేరిట 10.7 శాతానికి వడ్డీ  తీసుకుంటే డబ్బులు తక్కువ వస్తున్నాయంటున్నారని,  అడంబరాలకు,ప్రచారాలకు  వేల కోట్లు  దుర్వినియోగం చేస్తుంటే డబ్బులు ఎందుకు తక్కువ రావు అని అన్నారు.  కార్తీక వనమహోత్సవం, మహా సంకల్పం,నవనిర్మాణ దీక్ష,పేదరికంపై గెలుపు,మీ–సేవ భూధార్,జాతీయ మహిళా రైతు దినోత్సవం,జలసిరికి హారతి,నైపుణ్య పోటీలు, ఏరువాక పండగ, ధర్మపోరాట దీక్ష అంటూ రకరకాల  ప్రకటనలతో దుబారా చేస్తున్నారన్నారు.  2014–15లో 16వేల కోట్లు, 2015–16 22వేల కోట్లు .2016–17లో 23 వేల 5వందల కోట్లు కేంద్రం వచ్చిందన్నారు.ప్రభుత్వం మాత్రం మాత్రం అప్పు పెరిగింది. వడ్డీ పెరిగింది అని చెప్పుతుందని దుయ్యబట్టారు. ఎన్‌ఆర్‌జీఏ ద్వారా 2014–15లో 3వేల కోట్లు, 2016–17లో 5వేల ఏడువందల కోట్లు 2017–18లో 6వేల 150 కోట్లు , కేంద్రంతో విడిపోయిన తర్వాత  నవంబర్‌కే 6వేల కోట్లు వచ్చిందన్నారు. నీరు–చెట్టుకు  2014–15లో రెండువేల తొమ్మిది వందల కోట్లు, 2015–16లో 3వేల కోట్లు, 2016–17ల6 మూడువేల 7వందల కోట్లు,2017–18లో 5వేల కోట్లు, 2018–19లో 5,800 కోట్లు నిధులు వచ్చాయన్నారు.  90శాతం నీరు చెట్టుకు వాడుతున్నారని,  11వేల 180 కోట్లు  అక్టోబర్‌ వరుకు నీరు–చెట్టు పథకంలో వాడరన్నారు. నీరు–చెట్టులో విచ్చలవిడిగా దోచేస్తూ  కేంద్రం నుంచి తక్కువ డబ్బులు వస్తున్నాయంటూ టీడీపీ ప్రభుత్వం ప్రకటనలు చేస్తుందన్నారు.

కేంద్రం నుంచి వచ్చిన నిధులకు లెక్కలున్నాయా అని ప్రశ్నించారు. చంద్రబాబు పాలనలోనే రాష్ట్ర అప్పులు పెరిగిపోయాయి. ఒక దానికి కూడా సమాధానం లేదన్నారు.రాష్టంలో విపరిత కరువు నెలకొంటే టీడీపీ ప్రభుత్వం అడంబరాలు, ప్రచారాలతో నిధులను దుబారా చేస్తుందన్నారు. ప్రజలు వాస్తవాలు గ్రహించాలన్నారు.
 
Attachments area

తాజా వీడియోలు

Back to Top