టీడీపీ వెన్నులో ‘ఐటీ’ వణుకు

 
నెల్లూరు: రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ నేతలంతా ఐటీదాడులంటేనే బెంబేలెత్తిపోతున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్‌ అనిల్‌కుమార్‌ యాదవ్‌ అన్నారు. అవినీతి, అక్రమంగా అర్జించిన సొమ్ము బయటకు వస్తుందని భయపడుతున్నారన్నారు. నెల్లూరులో అనిల్‌కుమార్‌ యాదవ్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఐటీ అధికారులు పోలీసు రక్షణ ఇవ్వాలని చెప్పడం చూస్తూ టీడీపీ నాయకులు ఎంత భయపడుతున్నారో అర్థం అవుతుందన్నారు. నాలుగున్నరేళ్లుగా రాష్ట్ర ప్రజలను నడిరోడ్డున పడేసి ఇష్టారీతిగా దోపిడీ చేశారని, ఆ దోపిడీ సొమ్మునంతా అధికారులు కక్కించాలని కోరారు. పోలీసులు, అధికారులను అడ్డం పెట్టుకొని చంద్రబాబు నుంచి కిందిస్థాయి కార్యకర్త వరకు విచ్చలవిడిగా రాష్ట్ర వనరులను దోచుకుతిన్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత తెలుగుదేశం దొంగ ముఠాకు జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. 
Back to Top