రైతు పొట్టకొట్టే విధంగా బాబు పాలన

అడ్డు అదుపు లేకుండా దోచుకునేందుకే జీఓ 562
కలెక్టర్‌ వ్యవస్థను దళారీ వ్యవస్థగా మార్చేలా పరిస్థితులు 
జీఓ విడుదలకు ప్రతిపక్షాలతో మాట్లాడాలనే ఇంకింతం బాబుకు లేదు
రైతు వ్యతిరేక ప్రభుత్వమని చంద్రబాబే నిరూపించుకున్నారు
రానున్న ఎన్నికల్లో చంద్రబాబు పాలనకు అంతం తప్పదు
వైయస్‌ జగన్‌ సీఎం అయితే రాజన్న రాజ్యం వస్తుంది
జీఓను వెంటనే ఉపసంహరించుకోవాలని వైయస్‌ఆర్‌ సీపీ డిమాండ్‌
విజయవాడ: రైతుల పొట్టకొట్టే విధంగా చంద్రబాబు పాలన ఉందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. అన్నపూర్ణ రాష్ట్రంగా పేరుగాంచిన ఆంధ్రప్రదేశ్‌లో రైతులు, రైతు కూలీలు, కౌలు రైతులు బతనివ్వకుండా చంద్రబాబు కుట్రలు చేస్తున్నాడని మండిపడ్డారు. ప్రభుత్వాల ఆగడాలకు రైతులు వారి భూములు కోల్పోకూడదని 2013 భూసేకరణ చట్టాన్ని గత ప్రభుత్వాలు తీసుకొచ్చాయని, వాటిని ఏమాత్రం ఖాతరు చేయకుండా చంద్రబాబు సొంత చట్టాన్ని రూపొందించుకున్నాడని విమర్శించారు. అసెంబ్లీలో ప్రతిపక్షాలతో చర్చలు జరిపి మాట్లాడిన తరువాత మంచి వాతావరణంలో బిల్లు పాస్‌ చేసుకోవాలని ఇంకింత జ్ఞానం కూడా చంద్రబాబుకు లేదన్నారు. చంద్రబాబు తీసుకొచ్చిన 2018 భూసేకరణ యాక్ట్‌కు ముందు అనేక మంది మేధావులు, పెద్దలు సూచనలు చేసినా వాటిని పెడచెవినబెట్టి జీఓ నెంబర్‌ 562ను రైతులు, రైతు కూలీలు, కౌలు రైతులకు వ్యతిరేకంగా విడుదల చేశారన్నారు. తక్షణమే ఈ జీఓను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. విజయవాడ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 

– విపక్షాలతో చర్చించకుండా చంద్రబాబు జీఓ నెంబర్‌ 562 విడుదల చేసి 2018 భూసేకరణ చట్టం తీసుకొచ్చి రైతులు, రైతు కూలీలు, కౌలు రైతుల వ్యతిరేకి అని నిరూపించుకున్నారు. 
– రైతుల పొట్టకొట్టే ఈ జీఓను తక్షణం ఉపసంహరించుకోవాలి.
– ఈ రాష్ట్రానికి రాజధాని లేదు. మేం కట్టిస్తామని కేంద్రం ప్రభుత్వం విభజన చట్టంలో పేర్కొంది.
– చంద్రబాబు తన స్వార్ధం కోసం ల్యాండ్‌ పూలింగ్‌ తీసుకువచ్చారు.
– చంద్రబాబు, ఆయన కొడుకు లోకేష్‌ లాగా రైతులు పార్క్‌ హయత్‌ హోటల్‌లో ఉండరు. ఆ హోటల్‌లో చంద్రబాబు కుటుంబం కోసం రాష్ట్ర ప్రజల కష్టార్జితాన్ని బిల్లుల రూపంలో కోట్ల రూపాయలు చెల్లించారు.
– రైతు, రైతు కూలీలకు వ్యతిరేకంగా పనిచేయాలనే చంద్రబాబు ఉద్దేశ్యం.
– రైతుల భూములు లాక్కోవాలనే దుర్మార్గమైన ఆలోచన తప్ప మరొకటి లేదు.
– కేంద్రం భూసేకరణ చట్టం ప్రకారం భూములు తీసుకోవాలంటే గ్రామసభ ఆమోదం, రైతులతో చర్చలు,
ఆహారభద్రత, రైతుకూలీల ఉపాధి వంటి వాటి గురించి చూడాలి.
– కాని చంద్రబాబు ప్రభుత్వం చట్టం ప్రకారం పైన పేర్కొన్న వాటిని గురించి ఆలోచించకుండానే రైతుల నుంచి భూములు తీసుకోవచ్చు. పైగా కనీసం కోర్టులకు కూడా వెళ్లకూడదనే నిబంధన సైతం పెట్టారు.
– భూసేకరణ సెటిల్‌మెంట్‌లన్నీ కూడా కలెక్టర్‌ ద్వారా జరుగుతాయని అంటున్నారు.
– ఈ చట్టం ద్వారా కలెక్టర్‌ వ్యవస్థను కూడా భ్రష్టుపట్టించేలా పరిస్థితులు రాబోతున్నాయి. కలెక్టర్‌ల వ్యవస్థను దళారి వ్యవస్థగా మారుస్తున్నారు.
–ఈ జీఓ 562 ద్వారా భూమి కావాలని దరఖాస్తు చేసుకంటే అవి మూడు పంటలకంటే అధికంగా పండుతున్నా సరే తీసుకోవచ్చు. అంటే భూములపై ప్రైవేటు కంపెనీల కన్ను పడితే చాలు కలెక్టర్‌ను ఉపయోగించి యధేచ్ఛగా తీసుకోవచ్చు.
– స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటీష్‌ వారు ఇలాంటి చట్టాలు తెచ్చారు.
– రాజధానిలో 500 ఎకరాలు సరిపోతుందనుకుంటే చంద్రబాబు లక్షా ఆరువేల ఎకరాలు లాక్కున్నాడు.
– పొలాలు తగులబెట్టించి భయపెట్టి, బెదిరించి 33 వేల ఎకరాలు తీసుకున్నాడు. కాని అన్ని ఎకరాలు తీసుకుని ఏమైనా నిర్మిండా అంటే అదీ లేదు. ఇప్పటి వరకు ఒక్క శాశ్వత భవనం కట్టలేదు.
– నాలుగు నెలల్లో చంద్రబాబు అధికారం కోల్పోవడం ఖాయం. ఎన్నికల్లో వైయస్‌ జగన్‌ విజయం సాధించి రాజన్న రాజ్యాన్ని తీసుకువస్తారు.  
– ఇలాంటి చట్టాల గురించి రైతులు భయపడాల్సిన అసరం లేదు.
– చంద్రబాబు విధానాలు అనుసరిస్తే రైతు అనే మనిషి భవిష్యత్తులో బతికే అవకాశం లేదు. ఇలాంటి దుర్మార్గ జీఓలు తీసుకువచ్చే చంద్రబాబును న్యాయస్థానంలో ఎదిరిస్తాం. ఈ జీఓను అడ్డుపెట్టుకుని భూసేకరణ చేస్తే వాటిని ఎదుర్కొందాం. వ్యవసాయం లాభసాటి కాదు అని చెప్పేవాడు చంద్రబాబు. ఇప్పటికైనా చంద్రబాబు తన తప్పు తాను తెలుసుకోవాలి. రాబోయో రోజులలో చంద్రబాబు పాలనకు అంతం తప్పదు. 
Back to Top