వైయస్‌ జగన్‌కు ఒక్కసారి అవకాశం ఇవ్వండి

విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో రావాలి జగన్‌.. కావాలి జగన్‌
నవరత్నాల గురించి వివరించిన వెల్లంపల్లి, ఇక్బాల్‌
కృష్ణా: చంద్రబాబును నమ్మి మోసపోయిన ప్రజలు వైయస్‌ జగన్‌కు ఒక్క అవకాశం ఇవ్వాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు వెల్లంపల్లి శ్రీనివాస్, మహ్మద్‌ ఇక్బాల్‌ కోరారు. కృష్ణా జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో రావాలి జగన్‌.. కావాలని జగన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి, ఇక్బాల్‌ గడప గడపకూ వెళ్లి వైయస్‌ జగన్‌ ప్రకటించిన నవరత్నాలను వివరించారు. కరపత్రాలు పంచుతూ నాలుగున్నరేళ్ల చంద్రబాబు వైఫల్యాలను ఎండగట్టారు. రాజన్న రాజ్యం రావాలంటే వైయస్‌ఆర్‌ సీపీ అధికారంలోకి రావాలన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నవరత్నాలు ఏ విధంగా మేలు చేస్తాయనే ఉద్దేశంతో ప్రజలకు మేలు చేయడానికి వైయస్‌ జగన్‌ రాక అవసరమన్నారు. ప్రస్తుత ప్రభుత్వం విద్యా, ఆరోగ్యం, పారిశుద్ధ్యం ఇవన్నీ మరిచి ఊహాలోకాల్లో విహరిస్తుందని, అమరావతి, భ్రమరావతి అంటూ ప్రజలను మభ్యపెడుతుందని మండిపడ్డారు.

దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను చంద్రబాబు సర్కార్‌ నీరుగారుస్తుందని వారు ధ్వజమెత్తారు. వేలిముద్రలు పడక సరుకులు, పెన్షన్‌ ఇవ్వడం లేదన్నారు. కొద్ది రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి.. వైయస్‌ జగన్‌కు ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని కోరారు. వైయస్‌ జగన్‌ అన్ని వర్గాలకు భరోసా ఇస్తూ పాదయాత్రగా ముందుకుసాగుతున్నారన్నారు. రైతు, డ్వాక్రా రుణమాఫీ చేశామని చంద్రబాబు అబద్ధాలు చెబుతుంటే.. అసెంబ్లీ సాక్షిగా సంబంధిత మంత్రి రుణమాఫీ చేయబోమని తేల్చిచెప్పారన్నారు. ఇలాంటి అబద్ధాల కోరు నాయకులను ఇంటికి పంపించే సమయం ఆసన్నమైందన్నారు. 
Back to Top