ప్రత్యేకహోదాపై దద్దరిల్లిన అసెంబ్లీ

అమరావతిః ప్రత్యేకహోదాపై ఏపీ అసెంబ్లీ దద్దరిల్లింది.  పార్లమెట్ సాక్షిగా ఇచ్చిన చట్టబద్ధ హామీ అయిన హోదా అవసరం లేదంటూ చంద్రబాబు మాట్లాడడంపై ప్రతిపక్ష వైయస్సార్సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రత్యేక ప్యాకేజీ పేరుతో బాబు మోసం చేస్తున్నారని సభ్యులు మండిపడ్డారు. ఐదుకోట్ల ఆంధ్రుల హక్కును బాబు కేంద్రానికి తాకట్టుపెట్టారని ఫైర్ అయ్యారు. ప్రత్యేకహోదాపై వైయస్ జగన్ మాట్లాడుతుండగా స్పీకర్ మైక్ కట్ చేయడాన్ని నిరసిస్తూ వైయస్సార్సీపీ సభ్యులు పోడియం వద్ద నిరసన చేపట్టారు. వియ్ వాంట్ జస్టిస్, ప్రత్యేకహోదా కావాలి అంటూ నినదించారు.

Back to Top