స్పీకర్‌ పోడియం ముట్టడి

ఏపీ అసెంబ్లీ: టెన్త్‌ పేపర్‌ లీకేజీపై చర ్చకు అనుమతించాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు పట్టుబట్టారు. స్పీకర్‌ చర్చకు అనుమతించకపోవడంతో ప్రతిపక్ష సభ్యులు ప్లకార్డు చేతపట్టుకొని స్పీకర్‌ పోడియాన్ని ముట్టడించి శాంతియుతంగా నినాదాలు చేశారు. వాయిదా తీర్మానంపై పట్టించుకోకుండా ప్రభుత్వం ముందుకు వెళ్లడంతో ప్రతిపక్ష సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. లక్షలాది మంది పదో తరగతి విద్యార్థులకు అన్యాయం చేయొద్దని సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. నారాయణ సంస్థల పాత్రపై సీబీఐ విచారణ జరపాలని వైయస్‌ఆర్‌సీపీ సభ్యులు డిమాండ్‌ చేశారు. విపక్ష సభ్యుల డిమాండ్‌ను పట్టించుకోకపోవడంతో సభలో తీవ్ర గందరగోళం నడుమ మరోమారు స్పీకర్‌ సభను వాయిదా వేశారు.

Back to Top