ప్రజా సంకల్ప యత్ర ఏడాది పూరై్తన సందర్భంగా ప్రత్యేక పూజలు


–  వైయస్‌ జగన్‌ త్వరగా కోలుకోవాలని పూజలు
విశాఖ: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఏడాది పూరై్తన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక పూజలు, ప్రార్థనలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విశాఖ జిల్లాలో  వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు కేకే రాజు ఆధ్వర్యంలో అభయాంజనేయస్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. వైయస్‌ జగన్‌ త్వరగా కోలుకోవాలని పూజలు నిర్వహించారు. ప్రజల మన్ననలు పొంది రాజన్న రాజ్యం రావాలని, వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. ప్రజా సంకల్ప యాత్రలో ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన నాయకుడు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి త్వరగా కోలుకోవాలని, మళ్లీ పాదయాత్రను కొనసాగించాలని కోరినట్లు రాజు తెలిపారు. చంద్రబాబు పాలనలో రైతులు, డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ కాలేదన్నారు. ఏ ఒక్కరికి కూడా ఉద్యోగం రాలేదని, నిరుద్యోగ భృతి బూటకమని విమర్శించారు. 
 
Back to Top