ప్రజా సంకల్ప యాత్ర‌కు మ‌ద్ద‌తుగా పాద‌యాత్ర

గార్లదిన్నె: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 6న నుంచి తలపెట్టిన ప్రజా సంకల్పయాత్ర విజయవంతం కావాలంటూ వైయ‌స్ఆర్‌సీపీ నేతలు శుక్రవారం కల్లూరు నుంచి పాదయాత్రగా కోటంక సుబ్రమణ్యంస్వామి గుడికి చేరుకొని 101 కొబ్బరికాయలు కొట్టి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. పార్టీ జిల్లా నాయకులు అమరేంద్ర నాథ్‌రెడ్డి, అనంతపురం మాజీ మార్కెట్‌యార్డు చైర్మన్‌ నారాయణరెడ్డి, యువ జన విభాగం జిల్లా అధ్యక్షులు ఆలూరి సాంబశివారెడ్డి,   సైంటిపిక్‌ రీసెర్చ్‌ చారిటబుల్‌ ట్రస్టు చైర్మన్‌ జీవానందరెడ్డిలు పాదయాత్రలో పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈసందర్భంగా కల్లూరు, గార్లదిన్నె, మర్తాడు, కోటంక గ్రామాల్లో స్థానిక నాయకులు, కార్యకర్తలు వైయ‌స్ఆర్‌ అభిమానులు వారికి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వారు విలేకర్లతో మాట్లాడుతూ ..ఎన్నికల స‌మ‌యంలో సందర్భంగా చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఒక్కటి నేరవేర్చకుండా ప్రజలను మోసం చేశారన్నారు.  అన్ని వర్గాల ప్రజలను కలుసుకొని వారి కష్టాలు తెలుసుకునేందుకు తమ పార్టీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పాదయాత్ర తలపెట్టారని వివరించారు. ఈ యాత్ర విజయవంతం కావాలని కల్లూరు నుంచి సుబ్రమణ్య స్వామి గుడి వరకు పాదయాత్ర చేశామన్నారు. కార్య‌క్ర‌మంలో పార్టీ నాయ‌కులు చీమల రామక్రిష్ణ, ఎస్సీసెల్‌ మండల అధ్యక్షులు లక్ష్మినారాయణ, కొండాయాదవ్, చరణ్, ఎగువపల్లి బాలిరెడ్డి, యర్రగుంట్ల మాజీ ఎంపీటీసీ అనీల్‌ కుమార్‌రెడ్డి, పెద్దపోతుల పవన్, రెప్పల్‌ ఖాజా, శివారెడ్డి, పీరా, బాల కాశీం  పాల్గొన్నారు. 
----------------------------
4న జొన్నలగడ్డ పద్మావతి పాదయాత్ర
 శింగనమలః  వైయ‌స్ఆర్ సీపీ ఆధినేత వైయ‌స్‌ జగన్‌మొహన్‌రెడ్డి చేపడుతున్న ప్రజా సంకల్ప పాదయాత్ర విజయవంతం కావాలని ఈ నెల 4 శనివారం బీకేఎస్‌ నుంచి దేవరకొండపైకి నియోజక వర్గ సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి పాదయాత్ర చేపడుతున్నదని, నియోజక వర్గంలోని కార్యకర్తలు, నాయకులు తరలిరావాలని యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆలూరి సాంబశివారెడ్డి పిలుపునిచ్చారు. బీకేఎస్‌లోని దేవాలయాలన్నింటిలోను ప్రత్యేక పూజలు చేసి, అక్కడి నుంచి దేవరకొండపైకి నడుచుకుంటూ వెళ్లి , ప్రత్యేక పూజలు చేసి, కొబ్బరికాయలు కొడుతున్నట్లు తెలిపారు. 
Back to Top