ప్లీనరీకి తరలి వెళ్లిన వైయస్సార్‌ సీపీ అభిమానులు

ఎల్‌.ఎన్‌.పేట:జిల్లా కేంద్రంలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బుధవారం నిర్వహించిన  ప్లీనరీకి మండలంలోని పలు గ్రామాలకు చెందిన ఆపార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులతో నిర్వహించిన ప్లీనరీ కార్యక్రమంలో తాము భాగస్వామ్యం కావడం గొప్ప విషయంగా మండల కన్వినర్‌ కిలారి త్రినాథరావు, పెనుమజ్జి విష్ణు, లోచర్ల మల్లేశ్వరరావులతో పాటు పలువురు చెప్పారు. ప్రజా సమస్యలపై గత మూడేళ్లుగా పోరాటం చేయడంతో పాటు భవిష్యత్‌లో ప్రజల పక్షాన నిలిచే విధంగా జిల్లా నాయకత్వం ఇచ్చే సూచనలు, సలహాలు స్వీకరించామన్నారు. వీరితో పాటు ఎర్ర జనార్థన, లావేటి కామేశ్వరరావు. కొల్ల కృష్ణ, గుజ్జల యోగేశ్వరరావులతో పాటు పలువురు తరలి వెళ్లారు.

పాతపట్నం:జిల్లా కేంద్రంలో బుధవారం నిర్వహించిన వైయస్సార్‌ సీపీ జిల్లా ప్లీనరీకి ఆ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. సీది జంక్షన్‌ నుంచి ఆటోలతో ప్రారంభమైన ర్యాలీని ఆ పార్టీ మండల అధ్యక్షుడు రెగేటి షణ్ముఖరావు పార్టీ జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో రాష్ట్ర వాణిజ్య విభాగపు ప్రధానకార్యదర్శి యరుకొల వెంకటరమణ, రాష్ట్ర ఎస్‌స్టీ సెల్‌ విభాగపు కార్యదర్శి డోల్లు క్రిష్ణమూర్తి, రాష్ట్ర పార్టీ పంచాయతీ కార్యదర్శి కొండాల అర్జునుడు, జిల్లా మహిళ ప్రధానకార్యదర్శి కె.జానకమ్మ, రెగేటి ఆనందరావు, పీ.వి.వి.కుమార్, ఎం.సుధాకరరావు, బమ్మిడి వరలక్ష్మి, గోర్లి ప్రభాకరరావు, కుప్పిలి రమణ, రంజిత్‌కుమార్, క్రిష్ణ, కుప్పిలి పద్మ తదితరులు పాల్గొన్నారు.

Back to Top