ఏపీలో హిందూధర్మ పరిరక్షణ కనుమరుగువిజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో హిందూధర్మ పరిరక్షణ  క‌నుమ‌రుగైంద‌ని  వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి మల్లాది విష్ణు ఆందోళన వ్యక్తం చేశారు. అర్చకుడు మల్లికార్జునశర్మ మృతికి కారకులెవరని ఆయన ప్రశ్నించారు. మల్లికార్జున శర్మ ఆత్మహత్యపై అనుమానాలు ఉన్నాయని, శర్మ కుటుంబానికి రూ.25 లక్షలు ఇవ్వాలని డిమాండు చేశారు. చంద్రబాబు పాలనలో అర్చకులు, పురోహితులపై దాడులు పెరిగాయన్నారు. అర్చకుల వేతనాల విషయంలో జీవో నంబర్‌ 77 ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశారు. అర్చకుల ఆకలి బాధలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. తిరుమలలో స్వామి వారి ఆభరణాలు మాయమైతే విచారణ జరపలేదన్నారు. టీటీడీలో అక్రమాలను ప్రశ్నించిన రమణదీక్షితులును తొలగించారని, దుర్గగుడిలో క్షుద్రపూజలు చేశారని, ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని ధ్వజమెత్తారు. 

మహాకూటమి మాయగాడు బాబు
చంద్రబాబు మహా కూటమి మాయగాడని, ఆయన నిజస్వరూపాన్ని కేసీఆర్‌ బయటపెట్టారని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకులు జోగి రమేష్‌ అన్నారు. సర్వేలన్నీ వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అవుతారని చెబుతున్నాయని పేర్కొన్నారు. చంద్రబాబును ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top