సోష‌ల్ మీడియా గొంతు నొక్కే ప్ర‌య‌త్నం

విజ‌య‌వాడ‌: అక్రమాలు ప్రజలకు తెలియకుండా ఉండేందుకు సోషల్‌ మీడియా గొంతు నొక్కేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తుంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ విజయవాడ, మచిలీపట్నం పార్లమెంటు జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను, కె. పార్ధసారథి, పామర్రు ఇన్‌చార్జి కైలా అనీల్‌ కుమార్‌లు మండిపడ్డారు. సోషల్‌ మీడియా ఆర్గనైజర్‌ నాగబాబుపై త‌ప్పుడు కేసులు పెట్ట‌డం స‌రికాద‌ని  సోష‌ల్ మీడియా వాలంటీర్ల‌పై ఇటీవ‌ల పోలీసుల వేధింపులు ఎక్కువయ్యాయ‌ని వారు పేర్కొన్నారు. అమరావతిలో జరుగుతున్న అక్రమాలు, అధికార పార్టీ నేతల అవినీతిపై సోషల్‌ మీడియాలో పోస్టింగ్‌ చేయడం త‌ప్పా అని ప్ర‌శ్నించారు.  కృష్ణా జిల్లా పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన పోలీసులపై ఒత్తిడి తేవడంతో నాగబాబుపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశార‌న్నారు. తప్పుడు కేసులు నమోదు చేయడంపై పామర్రు పోలీసుల తీరుపై డీజీపీకి ఫిర్యాదు చేస్తామని వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు తెలిపారు. 


Back to Top