<strong>– వైయస్ జగన్‌పై దాడికి నిరసనగా విశాఖలో 48 గంటల దీక్ష</strong><strong>– థర్డ్ పార్టీతో దర్యాప్తు చేపట్టాలని డిమాండు</strong>విశాఖ: ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణపై నమ్మకం లేదని వైయస్‌ఆర్‌సీపీ నాయకులు పేర్కొన్నారు. వైయస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నానికి నిరసనగా వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. విశాఖలోని జీవిఎంసీ గాంధీ విగ్రహం వద్ద పార్టీ నాయకులు చేపట్టిన 48 గంటల దీక్ష కొనసాగుతోంది. వైయస్ జగన్‌పై జరిగిన దాడిలో ఏర్పాటైన సిట్ విచారణపై నమ్మకం లేదని థర్డ్ పార్టీతో విచారణ చేయించాలని పార్టీ నాయకులు డిమాండు చేశారు. స్వాతంత్య్ర విచారణతోనే నిజాలు నిగ్గుతేలుతాయని తెలిపారు. ఘటన జరిగి పది రోజులైనా ఇంతవరకు నిందితుడి నుంచి ఎలాంటి నిజాలు రాబట్టలేదని, ఈ ప్రభుత్వంపై నమ్మకం లేదన్నారు. కేజీహెచ్, పోలీసుస్టేషన్‌కు నిందితుడిని తిప్పుతూ డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు. ప్రజాధరణ ఉన్న ప్రతిపక్ష నేతపై దాడి జరిగితే ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని మండిపడ్డారు. హత్యాయత్నం జరిగితే కుట్రదారులు, సూత్రధారులు ఎవరు లేరా అని ప్రశ్నించారు. సిట్ అధికారులు కాలయాపన చేస్తున్నారే తప్ప ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. చంద్రబాబు ఆదేశాలతో సిట్ అధికారులు సిట్, స్టాండ్‌గా వ్యవహరిస్తున్నారన్నారు. ఇదే హత్యాయత్నం టీడీపీ నేతలపై జరిగితే ఈ ప్రభుత్వం ఇలాగే వ్యవహరించేదా అని ప్రశ్నించారు. థర్డ్ పార్టీతో దర్యాప్తు చేపట్టాలని పార్టీ నాయకులు డిమాండు చేశారు.