దమ్ముంటే బడాబాబుల ఆక్రమణలు కూల్చేయండి

అనంతపురం: గరీబోళ్ల గుడిసెలపై మీ ప్రతాపం చూపకండి.. మీకు దమ్ముంటే రోడ్లకు రోడ్లు ఆక్రమించి పెద్ద పెద్ద భవంతులు నిర్మించుకున్న బడా వ్యాపారుల భవనాలను కూల్చివేయండి. అంతేకానీ పేదలజోలికొస్తే మాత్రం సహించేది లేదని టౌన్‌ప్లానింగ్‌ అధికారులకు వైయస్‌ఆర్‌సీపీ నాయకులు మండిపడ్డారు. గుంతకల్లు 9వ వార్డు పరిధిలోని మహబూబ్‌నగర్‌ కాలనీ జిన్నా వెనుక చిన్న డ్రైనేజీ కోసం ఇళ్లు, లెట్రిన్‌లు, ప్రహారీలను కూల్చివేయించిన ఆ వార్డు టీడీపీ కౌన్సిలర్‌ లక్ష్మినారాయణకు వ్యతిరేకంగా సీపీఎం ఆధ్వర్యంలో కాలనీవాసులు మంగళవారం మున్సిపల్‌ కార్యాలయంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు వైయస్‌ఆర్‌సీపీ యకులు మద్దతిచ్చారు.  వైయస్‌ఆర్‌సీపీ 9వ వార్డు ఇన్‌చార్జ్‌ పి.రవి, మాజీ కౌన్సిలర్‌ సుంకప్ప  మాట్లాడారు. వార్డు కౌన్సిలర్‌ లక్ష్మినారాయణ కాలనీప్రజల పట్ల కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. చిన్న డ్రైనేజీ కోసం పేదల ఇళ్లు, లెట్రిన్‌లు కూల్చివేయించాల్సిన అవసరం ఏమొచ్చిందని నిప్పులు చెరిగారు. కౌన్సిలర్‌ తన నిరంకుశ వైఖరిని మార్చుకోకపోతే తగిన బుద్దిచెబుతామని వారు హెచ్చరించారు. అనంతరం కమీషనర్‌ సత్యనారాయణను కలిసి వినతిపత్రం ఇచ్చారు.  

Back to Top