ఇదంతా ఆపరేషన్‌ గరుడ డ్రామానే


– వైయస్‌ జగన్‌పై జరిగింది ముమ్మాటికీ హత్యాయత్నమే
– పోలీసుల సహకారం లేకుండా వ్యక్తి కత్తితో రాగలడా?
– ఘటన జరిగిన వెంటనే విచారణ లేకుండా డీజీపీ ఎలా మాట్లాడతారు?
– డీజీపీ కేసు నీరుగార్చే విధంగా మాట్లాడారు
– ప్రభుత్వం విడుదల చేసిన ఫ్లెక్సీ పచ్చ రంగులో ఉంది
– ఫోటోలు మార్ఫింగ్‌ చేసి ఫ్లెక్సీలు సృష్టించారు
– ఇదంతా ఆపరేషన్‌ గరుడ డ్రామానే
– గరుడ ఆపరేషన్‌కు స్క్రీన్‌ఫ్లే, దర్శకత్వం అన్నీ చంద్రబాబే
– టీడీపీలో ఉన్నామని నిందితుడు శ్రీనివాస్‌ అన్న చెప్పాడు
– నిందితుడు టీడీపీ కార్యకర్త..అతనికి రెండు హౌసింగ్‌ లోన్లు ఇచ్చారు
– ఆనాడు చంద్రబాబుపై దాడికి నిరసనగా వైయస్‌ నల్లబ్యాడ్జీతో నిరసన తెలిపారు
– ఇప్పుడు చంద్రబాబు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు

 హైదరాబాద్‌:  వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌పై నిన్న జరిగింది హత్యాయత్నమే అని పార్టీ సీనియర్‌ నాయకులు, తాజా మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఈ దాడికి కథ, స్క్రీన్‌ ఫ్లే, దర్శకత్వం, రచన అన్నీ కూడా చంద్రబాబే అని, ఆపరేషన్‌ గరుడ అంతా డ్రామానే అని స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని న్యూరో సిటీ ఆసుపత్రి వద్ద చికిత్స పొందుతున్న వైయస్‌ జగన్‌ను పరామర్శించిన అనంతరం వైయస్‌ఆర్‌సీపీ నేతలు మీడియాతో మాట్లాడారు. వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. వైయస్‌ జగన్‌పై నిన్న జరిగిన దాడి కాదు..హత్యాయత్నం..ప్రభుత్వం స్పందిస్తున్న తీరు ఆశ్చర్యంగా ఉందని, ఇది బాధాకరమన్నారు. వాళ్లే చేయిస్తారని, వాళ్ల పోలీసులతోనే విచారణ చేయిస్తామని పోలీసులను హైదరాబాద్‌కు పంపించారన్నారు. 

వీఐపీ లాంజ్‌లోకి ఓ వ్యక్తి కత్తి తీసుకొని వచ్చి ప్రతిపక్ష నేతపై దాడి చేశారంటే..పోలీసుల సహకారం లేకుండా ఆ వ్యక్తి ఎలా వస్తారని ప్రశ్నించారు. ఏయిర్‌ పోర్టులో ఉన్న క్యాంటీన్‌ టీడీపీ నాయకుడిదని, మా పార్టీ అధ్యక్షుడిపై దాడి చేశారంటే ప్రభుత్వం ప్రమేయం లేకుండా ఇది సాధ్యమా అని ప్రశ్నించారు. ఆ శ్రీనివాసరావు మా పార్టీ కార్యకర్త అని ప్లేక్సీలు విడుదల చేస్తున్నారని, సంఘటన జరిగిన గంటలోపే డీజీపీ మాట్లాడారని, వాళ్ల కార్యకర్తే చేశారని, చిన్న ఘటన అని విచారణను తప్పుదోవ పట్టించేందుకు డీజీపీతో చెప్పించారన్నారు. డీజీపీ స్థాయి వ్యక్తి అలా మాట్లాడవచ్చా అన్నారు. రెండు గంటల్లోనే రాష్ట్ర మంత్రులు శ్రీనివాసరావు వైయస్‌ జగన్‌తో దిగిన ఫోటోలు, ఫ్లేక్సిలు విడుదల చేశారన్నారు. 11 నెలల నాటి ఫ్లెక్సీని సంఘటన జరిగిన గంటలోనే ఎలా తెరపైకి తెచ్చారన్నారు. పచ్చ రంగుతో పూసిన ఫ్లెక్సీని బయటపెట్టారన్నారు. 

మా పార్టీ కార్యకర్త ఇంతవరకు ఎల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయలేదన్నారు. వైయస్‌ఆర్‌ ఫోటో లేకుండా ఫ్లెక్సీ ఉండదన్నారు. ఆ ఫ్లెక్సీలో గద్ద ఫోటో ఉందని, దీన్ని బట్టి చూస్తే టీడీపీ నేతలే తయారు చేశారన్నారు. ఆ ఫ్లెక్సీ, ఆపరేషన్‌ గరుడకు చంద్రబాబే డైరెక్షన్, నిర్మాత అన్నారు. శ్రీనివాసరావు అన్న మాట్లాడుతూ..గతంలో వైయస్‌ఆర్‌సీపీ  అభిమానులమే అని, ఇప్పుడు టీడీపీలో ఉన్నామని చెప్పారన్నారు. మీ పార్టీ కార్యకర్తగా ఉండటమే కాదని, ఆ అబ్బాయి కుటుంబానికి రెండు లోన్లు ఇచ్చారన్నారు. ముమ్మడి వరంలో రెండు ఇల్లు ఇచ్చారని గుర్తు చేశారు. గరుడ ఆపరేషన్‌ వెనుక చంద్రబాబు ఉన్నారని, మా పార్టీ కార్యకర్తకు ఆశ చూపి ఇలాంటి చర్యలకు పురిగొల్పారన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలు దారుణమని ఖండించారు. 2003లో చంద్రబాబుపై హత్యాయత్నం జరిగితే నాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వైయస్‌ఆర్‌ ఎలా స్పందించారో, మీరు ఇప్పుడు ఎలా స్పందించారో ప్రజలు గమనించారని, మిమ్మల్ని ఛీదరించుకుంటున్నారని తెలిపారు. నాడు వైయస్‌ రాజశేఖరరెడ్డి తిరుపతిలో గాంధీ విగ్రహం వద్ద నల్లరిబ్బన్‌ కట్టుకొని ధర్నా చేశారన్నారు. చంద్రబాబుకు అసలు మానవత్వం ఉందా అని ప్రశ్నించారు. 

మెడలో గురి పెట్టి హత్యచేయాలని ప్రయత్నించారని, త్రుటీలో తప్పించుకున్నారని చెప్పారు. ఇలాంటి ఘటన జరిగితే అక్కడ ప్రాథమిక చికిత్సలకు మాత్రమే అవకాశం ఉందన్నారు. ఎయిర్‌ పోర్టు లాంజ్‌లోనే అంగీ తొలగించి, కాటన్‌తో కట్టుకట్టించుకుని, టీటీ ఇంజక్షన్‌ వేయించుకుని హైదరాబాద్‌కు వచ్చారన్నారు. అక్కడ ఎవరు కూడా ఆసుపత్రికి వెళ్దామని అధికారులు సూచించలేదన్నారు. అక్కడ డాక్టర్‌ ఎవరూ లేరని, కేవలం అర్ధ ఇంచు మాత్రమే గాయం అయ్యిందని చంద్రబాబు దారుణంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆ కత్తికి కెమికల్‌ రియక్షన్‌ ఉంటుందనే అనుమానంతోనే హైదరాబాద్‌లో బెటర్‌ చికిత్సలు ఉంటాయనే ఆలోచనతోనే వచ్చారన్నారు. మీ ఆసుపత్రిలో మా నాయకుడికి భద్రత ఉండదనే ఇక్కడికి వచ్చారన్నారు. నేరుగా ఎయిర్‌ పోర్టు నుంచి ఆసుపత్రికి వచ్చారన్నారు. ఇక్కడ వెంటనే సర ్జరీ జరిగిందని, మూడున్నర ఇంచుల గాయం అయ్యిందని, 9 కుట్లు వేశారని డాక్టర్లే చెబుతుంటే..చంద్రబాబు వక్రీకరించి మాట్లాడటం బాధాకరమన్నారు. ఫ్లెక్సీ, లెటర్‌ అన్నీ కూడా టీడీపీ నేతలు సృష్టించినవే అని స్పష్టం చేశారు. దాడి సమయంలో శ్రీనివాస్‌ జేబులో ఎలాంటి లేఖ లేదన్నారు. హత్యా ప్రయత్నంపై సమగ్ర విచారణ చేపట్టాలని వైవీ సుబ్బారెడ్డి డిమాండు చేశారు.

చంద్రబాబు ఈ కేసులో ఏ -1 ముద్దాయి.ఏ-2 డిజిపి... కాబట్టి ధర్డ్ పార్టీ విచారణ జరిపి నిజాన్ని నిగ్గు తేల్చాలని, రాష్ర్ట ప్రభుత్వవిచారణపై మాకు నమ్మకం లేదు.కోర్టును ఆశ్రయించబోతున్నామ‌న్నారు. - కేంద్ర ప్రభుత్వ సంస్దలతో విచారణ జరిపించాలని, ముఖ్యమంత్రి,డిజిపి వీరందరిపై విచారణ జరపాల్సిందే అని వైవీ సుబ్బారెడ్డి స్ప‌ష్టం చేశారు.



 
Back to Top