మహానేత వైయస్‌ఆర్‌ స్ఫూర్తిని కొనసాగించాలి

వైయస్‌ఆర్‌ జిల్లాః  తెలుగురాష్ట్రాలు సమస్యశ్యామలం కావాలని నిరంతరం అహర్నిశలు శ్రమించిన వ్యక్తి దివంగత మహానేత వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి అని వైయస్‌ఆర్‌సీపీ నేత వైయస్‌ వివేకానంద రెడ్డి కొనియాడారు.పులివెందు బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కరువు పరిస్థితులను తొలగించాలనే సంకల్పంతో వైయస్‌ఆర్‌ సాగునీటి ప్రాజెక్టులను తీసుకువచ్చి ఒక రూపుకు తీసుకొచ్చారని దురదృష్టవశాత్తూ ఆయన మరణంతో సాగునీటి ప్రాజెక్టులు నిలిచిపోయాయన్నారు. నేటìకి ఆయన మరణం ఒక మిస్టరీగానే మిగిలిపోయిందన్నారు.. తెలుగుగంగ,హంద్రీనీవా, గాలినగరి ప్రాజెక్టుల కోసం  ఉద్యమాలు చేసి సాధించారన్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా సడలని సంకల్పంతో ముందుకు సాగార న్నారు. ప్రజల కష్టాలు తన కష్టాలుగా భావించి ప్రజలందరూ సమృద్ధిగా ఉండాలనే తపన ఆయనలో కనబడేదన్నారు.

తాజా ఫోటోలు

Back to Top