దళితుల సమస్యలను గాలికొదిలేశారు


హైదరాబాద్‌: దళితుల సమస్యలను ప్రభుత్వం గాలికి వదిలేసిందని, దళితుల సమస్యలపై నాలుగున్నరేళ్లుగా చంద్రబాబు స్పందించలేదని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి టీజేఆర్‌ సుధాకర్‌బాబు విమర్శించారు. ఎన్నిలకు ఆరు నెలల ముందు ఎస్టీలకు మంత్రి పదవి ఇచ్చారని తప్పుపట్టారు. టీడీపీ మేనిఫెస్టోలో కులాల వారీగా వందల హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. విద్యా వ్యవస్థను చైతన్య, నారాయణ సంస్థలకు తాకట్టు పెట్టారని ఆరోపించారు. 
 
Back to Top