బాబూ..ఇదేనా నీ 40 ఏళ్ల అనుభవం

-తుపానులో ప్రజలను ఎలా ఆదుకోవాలో ఒడిస్సా సిఎం ను చూసి నేర్చుకో..
- నీళ్లు , పాలు , ఆహారం ఇవ్వండి అని అడిగితే పోలీసులతో కేసులు పెట్టిస్తావా?
- పోలీసులు టిడిపికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు.
-అచ్చెన్నాయుడు ఒళ్లు దగ్గరపెట్టుకో..

 శ్రీకాకుళం :  న‌ల‌భై ఏళ్ల రాజ‌కీయ అనుభ‌వం ఉంద‌ని గొప్ప‌లు చెప్పుకునే చంద్ర‌బాబు..తుపాను బాధితుల‌ను ఎలా ఆదుకోవాలో తెలియ‌డం లేద‌ని వైయ‌స్ఆర్‌సీపీ నేత త‌మ్మినేని సీతారాం విమ‌ర్శించారు. ప‌క్క రాష్ట్రం ఒరిస్సాలో తుపాను వ‌చ్చిన స‌మ‌యంలో ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి న‌వీన్ ప‌ట్నాయ‌క్ బాధితుల‌ను ఎలా ఆదుకున్నారో చూసి నేర్చుకోవాల‌ని హిత‌వు ప‌లికారు. తిత్లీ తుపాన్ బాధితులు పాలు, నీళ్లు అడిగితే కేసులు పెట్టించార‌ని, అస‌లు ఆయ‌న ముఖ్య‌మంత్రినా..రౌడీనా అని ప్ర‌శ్నించారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు నోరు అదుపులో పెట్టుకోవాల‌ని హెచ్చ‌రించారు. శుక్ర‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. అందులోని ముఖ్యాంశాలు ఇలా..


-చంద్రబాబు నీవు ముఖ్యమంత్రి వా?.. రౌడీవా? బాదితులను నోర్ముయ్ అంటావా.
-నీళ్లు ,పాలు ,ఆహారం ఇవ్వండి అని అడిగితే పోలీసులతోకేసులు పెట్టిస్తావా?
-తుపాను ప్రాంతంలో నీవు చెప్పిది ప్రజలు వినాలని రుసరుసలాడటం కాదు....ప్రజలు చెప్పిన బాధలను వినడం చేయ్.
-తుపానులో ప్రజలను ఎలా ఆదుకోవాలో ఒడిస్సా సిఎం నవీన్ పట్నాయక్ ను చూసి తెలుసుకో.
-తుపాను సహాయక బృందాలను నియమించి చక్కగా పరిస్దితిని ఎదుర్కొన్నారు.
-ఆయన నీలాగా తుపానును కూడా రాజకీయాలకు వాడుకునే ప్రయత్నం చేయలేదు.
-అంతానువ్వే చేస్తున్నట్లు బిల్డప్ ఇచ్చుకోవడానికి ప్రయత్నిస్తావా.
-నీవు ఇక్కడే ఉంటే ఐఏఎస్ లంతా నీ చుట్టు ఉండి బాబు..బాబు..అంటూ భజనకే సరిపోతుంది.
-వారం దాటినా ఎన్యుమరేషన్ కూడా చేయలేకపోయారు.నష్టం అంచనాలు తీసుకోలేదు.
-చంద్రబాబు నీవు, నీ మంత్రులు నోటిని అదుపులో పెట్టుకోండి.
-బాధితులు చెట్టుకు 5 వేల అడుగుతుంటే 1500 ఇస్తానంటావా? చెట్టు తొలగించేందుకే వేయి రూపాయలవుతుంది.
-ముఖ్యమంత్రిగా ఆదుకోవాల్సింది పోయి తుపాను భాదితులను అవమానిస్తావా?
-చంద్రబాబు పద్దతి మార్చుకుని హుందాగా వ్యవహరించు.
-పోలీసులు టిడిపికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు.
-సాయం అఢిగితే పోలీసులతో కేసులు పెట్టిస్తావా?
-శ్రీకాకుళం ఉద్యమాల పురిటిగడ్డ...ఎంతమందిపై కేసులు పెడతావ్. 
-కేసులను ఎదుర్కొనే సత్తా శ్రీకాకుళం వాసులకు ఉంది.
-ప్రజలు కష్టాలలో ఉంటే నిలదీస్తారు...అంతమాత్రానా కేసులు పెడతారా...చంద్రబాబు అసహనం వీడండి.
-శ్రీకాకుళం వాసులకు వార్నింగ్ లు ఇస్తారా...బెదిరిస్తారా....అరెస్ట్ లు చేయ్ ,చూస్తాం...
-మేము పోరాడే సమయం ఆసన్నమైంది.ప్రత్యేక పరిస్దితులు నెలకొన్నాయ్.సహాయం అందిస్తారనే ఆశించాం.
-చంద్రబాబునీకిదే ముఖ్యమంత్రిగా చివరి అవకాశం...నిన్ను దగ్గరగా గమనించిన మనిషిగా చెబుతున్నా...
-23 మండలాలు ఎఫెక్ట్ అయితే 18 మండలాలు అని ప్రకటిస్తారా.ఇలాంటి సమయంలో పక్షపాతం చూపడం ఏంటి.
-నీ నిర్వాహకం వల్ల నారాయణమ్మ అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది.
- ఈ ఆత్మహత్యకు కారకులైన మీపై ఏ కేసు నమోదు చేయాలి.
-అచ్చెన్నాయుడు ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడు..తమాషా చేస్తున్నావా ..లేదంటే తాటవలుస్తా...
-తుపాను బాదితుల దగ్గరకు వెళ్లి ఏం మాట్లాడతావ్ అచ్చెన్నాయుడూ.అక్కడ ఓట్లు అడుగుతావా.రాజకీయం మాట్లాడతావా.
-పక్కజిల్లాలో ప్రతిపక్షనేత ఉన్నారు..ఆయన రాలేదని అంటావు.పవన్ కల్యాణ్ వస్తే ఆయనను విమర్శిస్తావ్.
-వస్తే ఒకలా...రాకపోతే మరోలా..ఇప్పటికే వైసిపివాళ్లు సహాయాన్ని అడ్డుకుంటున్నారు అంటూ విమర్శలు.
- వైయ‌స్‌ జగన్ వస్తే ఎన్ని తిట్లు తిడతావో.
-కేంద్రం నుంచి ఇప్పటిదాకా ఎందుకు స్పందన ప్రకటన రాలేదు.
-చంద్రబాబుకు నిధులు ఇస్తే అవి దుర్వినియోగం అవుతాయోమేననే ఉద్దేశ్యంతో నిదులు ఇవ్వడం లేదని బావిస్తున్నాం.
-కాని చంద్రబాబును చూసి రాష్ర్టానికి అన్యాయం చేయవద్దు అని కేంద్రాన్ని కోరుతున్నాం.
-సహాయ పునరావాస కార్యక్రమాలను కేంద్రం ద్వారా చేపట్టి భాదితులను ఆదుకోండి.
Back to Top