వైయ‌స్‌ జగన్‌ సీఎం అయితేనే పేదలకు న్యాయం

 


 శ్రీకాకుళం :  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్‌ జగన్‌ సీఎం అయితేనే పేదలకు న్యాయం జరుగుతుందని  వైయ‌స్ఆర్‌ సీపీ నేత తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. గురువారం డాక్టర్‌ బి. ఆర్‌ అంబేద్కర్‌ వర్థంతి సందర్భంగా  వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు భూమన కరుణాకర్‌ రెడ్డి, ధర్మాన ప్రసాదరావు‌, తమ్మినేని సీతారం, ధర్మాన కృష్ణదాస్‌, మజ్జి శ్రీనివాస్‌, రాజన్న దొర, కంబాల జోగులు, పుష్ప శ్రీవాణి, కళావతి పాల్గొన్నారు.

ఈ సందర్బంగా తమ్మినేని సీతారాం మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసమర్థత వలనే ఉ‍త్తరాంధ్రలో వలసలు పెరుగుతున్నాయని విమర్శించారు. ప్రజా సమస్యలను పరిష్కరించటంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని అన్నారు. ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కదాన్ని కూడా అమలు చేయలేదని మండిపడ్డారు.  వైఎస్‌ జగన్‌ పాదయాత్ర శ్రీకాకుళం జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోందని తెలిపారు. ప్రజలు తమ సమస్యలను చెప్పుకోవటానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారని చెప్పారు. 


Back to Top