రాష్ట్రంలో రావణ రాజ్యం సాగుతోంది

అచ్చెన్నాయుడు చదవులేని మూర్ఖూడు, బకాసురుడిలా తయారయ్యాడు
వైయస్‌ఆర్‌ మరణంతో రాష్ట్రం సర్వనాశనం
రాష్ట్రాన్ని కాపాడేందుకు వైయస్‌ఆర్‌ తనయుడు వైయస్‌ జగన్‌ వస్తున్నారు
వైయస్‌ఆర్‌ సీపీ టెక్కలి సమన్వయకర్త పేరాడ తిలక్‌
శ్రీకాకుళం: దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి మరణం తరువాత ఆంధ్రరాష్ట్రం సర్వనాశనం అయిపోయిందని, రావణ పాలన సాగుతోందని టెక్కలి నియోజకవర్గ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సమన్వయకర్త పేరాడ తిలక్‌ అన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ప్రజలంతా తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రావణ కాష్టంగా మారిన ఈ రాష్ట్రాన్ని కాపాడేందుకు మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి తనయుడు వైయస్‌ జగన్‌ నడుచుకుంటూ వచ్చారన్నారు. 328 రోజులు 3500ల కిలోమీటర్లు ప్రపంచంలో ఎవరూ పాదయాత్ర చేయలేదన్నారు. ప్రతి నియోజకవర్గంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలను కళ్లారా చూద్దామని, వాటికి పరిష్కారం కనుక్కుందామని, అధికారంలోకి వచ్చాక మళ్లీ రాజన్న పాలన అందించేందుకు అన్న వస్తున్నాడన్నారు. బకాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు.. ఆ రాక్షసుడికి బండెడు అన్నం, ఒక మనిషిని ఇస్తే ఊరుకునేవాడని, టెక్కలిలో మరో బకాసురుడు ఉన్నాడని, చదువులేని మూర్ఖూడు, ప్రజలను హింసించే దుర్మార్గుడు అచ్చెన్నాయుడు అని ధ్వజమెత్తారు. వైయస్‌ జగన్‌ వస్తున్నారని వేలాది మంది తరలివచ్చారని, తరలించిన జనం కాదు తరలివచ్చిన జనమన్నారు. నాలుగు రోజుల నుంచి కల్లు తాగిన కోతిలా అచ్చెన్నాయుడు గెంతుతున్నాడని మండిపడ్డారు. వైయస్‌ జగన్‌ మీటింగ్‌ను ఎలాగైనా దెబ్బతీయాలని శ్రీకాకుళంలో అధర్మపోరాటం సమావేశం పెట్టి టెక్కలిలో 300ల బస్సులు పెట్టి రూ. 5 వందలు ఇచ్చి, మందుపోసి, బెదిరించి తీసుకెళ్తున్నాడన్నారు. వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అవుతారు.. మళ్లీ సువర్ణ పాలన వస్తుందన్నారు. 

తాజా వీడియోలు

Back to Top