అవినీతి పాల‌న అంతం చేద్దాం
- వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి
- చిత్తూరు న‌గ‌రంలో పార్టీ కార్యాల‌యం ప్రారంభం
చిత్తూరు:  రాష్ట్రంలో అవినీతి పాల‌న‌ను అంత‌మొందిద్దామ‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి పిలుపునిచ్చారు. చిత్తూరు న‌గ‌రంలో పార్టీ కార్యాల‌యాన్ని ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..నాలుగేళ్లు బీజేపీతో క‌లిసి కాపురం చేసిన చంద్ర‌బాబు అప్ప‌ట్లో కాంగ్రెస్‌ను తిట్టార‌న్నారు. బీజేపీతో విడాకులు తీసుకొని ఇప్పుడు కాంగ్రెస్‌తో జ‌త క‌ట్టి ధ‌ర్మ పోరాటం అంటూ నాట‌కాలు ఆడుతున్నార‌ర‌న్నారు. ఏపీలో ధర్మపోరాట దీక్షలకు అయ్యే ఖర్చు ప్రభుత్వ ఖజానా నుంచి దుబారా చేయడం కాదా అని  ప్రశ్నించారు.   జన్మభూమి కమిటీలు, నీరు - చెట్టు, రోడ్ల మరమ్మతులు, మరుగుదొడ్ల నిర్మాణంలో అవినీతి తారాస్థాయిలో ఉందని విమర్శించారు. ఇంత అవినీతిలో కూరుకుపోయిన చంద్రబాబు..ధర్మపోరాట దీక్ష గురించి ఎలా మాట్లాడగలుగుతున్నారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.  ఇసుక మాఫియా, లిక్కర్‌ మాఫియా, చంద్రన్న కానుకల్లో కల్తీ సరుకులు వస్తున్నాయని, ఇలా ప్రతిదానిలో అవినీతి కనపడుతున్నా ధర్మపోరాటాలంటూ బాబు ప్రజల్ని మభ్యపెడుతున్నారని అన్నారు. శాంతి భద్రతల విషయంలో టీడీపీ దుర్మార్గంగా వ్యవహరిస్తోందని దు​య్యబట్టారు. కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే ఆర్‌ కె రోజా , ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బొత్స సత్యనారాయణ,  మోపిదేవి వెంకటరమణ, చిత్తూరు జిల్లా ఎమ్మెల్యేలు  చింతల రామచంద్రారెడ్డి, దేసాయీ తిప్పారెడ్డి , సునిల్ , చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి  నారాయణస్వామి, పెద్దిరెడ్డి ద్వారకనాధ్ రెడ్డి , వెంకటేష్ గౌడ్, చంద్రమౌళి, ఆదిమూలం ,శైలజ చరణ్ రెడ్డి  త‌దిత‌రులు పాల్గొన్నారు.

 
 
Back to Top