పథకాల కన్నా ప్రచారాలకే ఎక్కువ ఖర్చు



– యువనేస్తం ప్రచారానికి రూ.4.60 కోట్లు.. 
–యువనేస్తం పథకం నిరుత్సాహకరంగా ఉంది
–ప్రత్యేక హోదాపై యువకుల ప్రశ్నలకు సమాధానం చెప్పని సీఎం
– చంద్రబాబు ఇప్పటికీ దాటవేత ధోరణి అవలంభిస్తున్నారు
– ప్రత్యేక హోదా రావడం చంద్రబాబుకు ఇష్టం లేదు
– వైయస్‌ జగన్‌ను కలిసిన 9 మంది టీచర్లను అన్యాయంగా సస్పెండ్‌ చేశారు
– బాబు 30 విదేశీ యాత్రలతో ఏం సాధించారు.
– చంద్రబాబు పాలనలో ఆర్థిక క్రమశిక్షణ లేదు.

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పథకాల కన్నా ప్రచారానికే ఎక్కువ ఖర్చు చేస్తున్నారని, చంద్రబాబు పాలనలో ఆర్థిక క్రమశిక్షణ లేకుండా పోయిందని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. యువనేస్తం పథకం హేతుబద్ధంగా ఉందని, ఇది నిరుద్యోగుల్లో నిరుత్సాహాన్ని నింపిందన్నారు. ప్రతిపక్ష నాయకుడిని కలిసిన ఉపాధ్యాయులను సస్పెండ్‌ చేయడం దారుణమని తీవ్రంగా ఖండించారు. బుధవారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడారు. యువనేస్తం కార్యక్రమంలో భాగంగా నిన్న విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సభలో చంద్రబాబు సరైన సమాధానం చెప్పకుండా తప్పించుకున్నారన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై నాలుగేళ్లు చంద్రబాబు విరుద్ధంగా మాట్లాడారన్నారు. నిన్న మీటింగ్‌లో మహేష్‌ అనే విద్యార్థి ప్రత్యేక హోదా వల్ల లబ్ధి కలుగుతుందా? ప్రత్యేక ప్యాకేజీ వల్ల మేలు జరుగుతుందా అని సీఎంను ప్రశ్నిస్తే..ఆయన నిర్వేదంతో మాట్లాడుతూ..రాష్ట్రం రెండంకెల అభివృద్ధి సాధించిందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఆ విద్యార్థి అడిగిన దానికి, చంద్రబాబు సమాధానం చెప్పినదానికి సంబంధం లేదన్నారు. చెవిటి పెద్దమ్మను చాంతాడు ఎక్కడా అని అడిగితే మా ఆయన పుట్టిన ఊరు బెజవాడ అనిచెప్పినట్లుగా చంద్రబాబు సమాధానం ఉందని ఎద్దేవా చేశారు. ఇప్పటికీ కూడా చంద్రబాబుకు ప్రత్యేక హోదాపై చిత్తశుద్ధి లేదు అని చెప్పడానికి నిన్న ఆ విద్యార్థి అడిగిన ప్రశ్నకు సీఎం చెప్పిన సమాధానమే నిదర్శనమని విమర్శించారు. కేంద్రం అన్యాయం చేస్తుందని చెప్పడం దారుణంగా ఉందన్నారు. ప్రత్యేక హోదా రావడం చంద్రబాబుకు ఇష్టం లేదన్నారు. 

ఇంతటి దారుణం ఎక్కడా చూడలేదు
ప్రతిపక్ష నేతను కలిసిన ఉపాధ్యాయులను ప్రభుత్వం సస్పెండ్‌ చేయడం దారుణమని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ప్రజాస్వామ్యంలో శాసన సభ్యుడు ఏ పార్టీకి చెందిన వ్యక్తి అయినా సరే ప్రజలు తమ సమస్యలను ప్రస్తావించడం సాధారణమన్నారు. ఇటీవల ప్రజా సంకల్ప యాత్రలో ప్రతిపక్ష నాయకులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని కొంత మంది ఉపాధ్యాయులు సీపీఎస్‌ రద్దు చేయాలని కోరితే అందుకు మా నాయకుడు అంగీకరించారన్నారు. ఈ మేరకు వైయస్‌ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపేందుకు ఉపాధ్యాయులు వెళ్తే 9 మంది టీచర్లను ఈ ప్రభుత్వం సస్పెండ్‌ చేసిందన్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ప్రతిపక్షాలపై, ఉద్యోగులపై, మహిళలపై దౌర్జన్యాలు అధికమయ్యాయని మండిపడ్డారు. తూతూమంత్రంగా నిధులు కేటాయించి పూర్తిస్థాయిలో రుణాలు మాఫీ చేశామని, ఇప్పుడేమో నిరుద్యోగ భృతి ఇచ్చేశామని గొప్పలు చెప్పుకోవడం సిగ్గు చేటు అన్నారు. యువనేస్తం ప్రచారానికి రూ.4.60 కోట్లు కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ఇంత దుబారా ఏ ప్రభుత్వంలో కూడా జరగలేదన్నారు. ఏ ముఖ్యమంత్రి కూడా విదేశాలకు ప్రత్యేక విమానాల్లో వెళ్లింది లేదని, ఒక్క చంద్రబాబే అలా చేశారన్నారు. అన్నిసార్లు ఆయన విదేశాలకు వెళ్లి ఒక్క పరిశ్రమనైనా తెచ్చారా అని నిలదీశారు. నిరుద్యోగులకు భృతి కింద రూ.1.60 లక్షలు ఇచ్చారన్నారు. వాస్తవానికి రాష్ట్రంలో 1.70 కోట్ల ఇళ్లకు నిరుద్యోగ భృతి ఇవ్వాల్సి ఉండగా కేవలం కొంత మందికి మాత్రమే వెయ్యి రూపాయల చొప్పున ఇచ్చి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. ఎన్నికలకు ఆరు నెలల ముందు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టకూడదని, ఎన్నికల సంఘం ఇలాంటి వాటిపై దృష్టిసారించాలని కోరారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయకుండ మళ్లీ ఎన్నికలు వస్తుంటే అరకొర ఇచ్చి పెద్ద ప్రచారం చేసుకుంటున్నారన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చి నెరవేర్చకుండా చంద్రబాబు మోసం చేస్తున్నారని, ఇలాంటి కార్యక్రమాలపై ఎన్నికల కమిషన్‌ చర్యలు తీసుకోవాలని, లేదంటే చంద్రబాబును చూసి మరో నేత ఇలాంటి మోసాలు చేసే అవకాశం ఉందన్నారు. యువనేస్తం కార్యక్రమం రాష్ట్రంలో నిరుద్యోగ యువతలో నిరుత్సాహాన్ని నింపిందన్నారు. కేవలం 6 లక్షల దరఖాస్తులు వస్తే..అందులో 1.62 లక్షల మందికి మాత్రమే నిరుద్యోగ భృతి ఇచ్చారని తెలిపారు. ఎన్నికలకు ముందు ఓట్లు కొనుగోలు చేసే విధంగా యువనేస్తం పేరుతో డబ్బులు పంపిణీ చేస్తున్నారని మండిపడ్డారు. యువనేస్తం పథకం హేతుబద్ధంగా లేదని, ఎన్నికల్లో లబ్ధి పొందాలన్నదే చంద్రబాబు ఉద్దేశ్యంగా కనిపిస్తుందన్నారు. క్రమశిక్షణ లô ని ప్రభుత్వాన్ని చంద్రబాబు నడుపుతున్నారని దుయ్యబట్టారు. రాజధాని పేరు మీద అప్పుల మీద అప్పులు చేస్తున్నారని తూర్పారబట్టారు. ఆర్థిక అవకతవకలన్నీ కూడా కాగ్‌ తప్పులు పట్టినా కూడా చంద్రబాబుకు ఏమీ కనపడటం లేదని చెప్పారు. ఇంత మోసపూరిత వ్యవహారాన్ని, అది కూడా గాంధీ జయంతి రోజున ఇలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం దుర్మార్గమని, చంద్రబాబు ప్రభుత్వానికి  ప్రజలు తప్పనిసరిగా గుణపాఠం చెప్పాలని పెద్దిరెడ్డి పిలుపునిచ్చారు.

రాధాకు వైయస్‌ఆర్‌సీపీ పూర్తి మద్దతు
వంగవీటి రాధా మా పార్టీలోనే ఉంటారని, ఆయన ఎక్కడ పోటీ చేసినా వైయస్‌ఆర్‌సీపీ మద్దతు ఇస్తుందని, ఈ విషయాన్ని మా అధినేత వైయస్‌ జగన్‌ చెప్పినట్లు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. పార్టీలో కొన్ని మార్పులు, చేర్పులు సహజమని, పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామన్నారు. గెలుపు గుర్రాల‌కు సీట్లు ఇవ్వాలని పార్టీ భావిస్తుందని, కృష్ణా జిల్లాలో ఏ ఒక్కరిని కూడా మార్చడం లేదని స్పష్టం చేశారు. 

 
Back to Top