రాజధాని నిర్మాణం పేరుతో వేల కోట్ల దోపిడీ


వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి పార్థసారధి
విజయవాడ: రాజధాని నిర్మాణం పేరుతో వేల కోట్ల దోపిడీకి చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి పార్థసారధి విమర్శించారు. రాష్ట్రాన్ని ఆర్థికవనరుగా చంద్రబాబు మార్చుకొని దోచుకుంటున్నారని విమర్శించారు. తన వర్గం విచ్చలవిడిగా దోచుకుంటుందన్నారు. రాష్ట్రాన్ని విడగొట్టే సమయంలో పార్లమెంట్‌ సాక్షిగా రాష్ట్రంలో అనేక నిర్మాణాలు చేస్తామని కేంద్రం హామీ ఇస్తే..ఆ చట్టాన్ని కూడా అమలు చేయించుకోలేని బలహీన ముఖ్యమంత్రి, చేతకాని వ్యక్తి చంద్రబాబు అన్నారు. వ్యక్తిగత ఆస్తులు, కుటుంబ ఆస్తులను పెంచుకోవడానికి ఏపీని చంద్రబాబు ఒక వనరుగా మార్చుకున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం రాజధాని నిర్మిస్తే తనకు ముడుపులు రావని, వేల కోట్లు దోచుకునేందుకు చంద్రబాబు కుట్ర పన్నారని విమర్శించారు. 
 
Back to Top