సీఎం ఇంటి కోసం రైతుల‌ను ఇబ్బందులు పెడ‌తారా?


విజ‌య‌వాడ‌: కృష్ణాతీరంలో రాజ‌ధాని ఏర్పాటు, సీఎం నివాసం..కృష్ణా డెల్టాకు ముప్పుగా ప‌రిణ‌మించింద‌ని వైయ‌స్ఆర్ సీపీ అధికార ప్ర‌తినిధి పార్థ‌సార‌ధి ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. చంద్ర‌బాబు ఇంటి కోసం రైతుల‌ను ఇబ్బందులు పెడ‌తారా అని ఆయ‌న ప్ర‌శ్నించారు. బుధ‌వారం పార్థ‌సార‌ధి మీడియాతో మాట్లాడుతూ..ప్ర‌కాశం బ్యారేజీకి వ‌ర‌ద వ‌చ్చిన‌ప్పుడు పూర్తిస్థాయిలో సాగునీరు నిల్వ చేసుకోవ‌డానికి అవ‌కాశం లేకుండా పోతుంద‌న్నారు. వ‌ర‌ద నీటిని స‌ముద్రం పాలుచేసి రైతుల‌ను ఇబ్బందిపెట్ట‌డం ఎంత‌వ‌రుకూ స‌మంజ‌స‌మ‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. చంద్ర‌బాబు నాయుడు నివాసం ఉంటున్న ఇంటిని దృష్టిలో పెట్టుకుని ప్ర‌కాశం బ్యారేజీ వ‌ద్ద 12 అడుగులు నీటిని నిల్వ ఉంచే సామ‌ర్థ్యం ఉన్న చంద్ర‌బాబు ఇంటికి ఇబ్బంది అనే కార‌ణంగా రెండు అడుగులు త‌గ్గించి కేవ‌లం 10 అడుగుల‌కే ప‌రిమితం చేస్తున్నార‌ని  విమ‌ర్శించారు.
Back to Top