నాడు ఎదురుదాడి..నేడు పొత్తు దారి


కాంగ్రెస్‌పై విమర్శలు మరిచిపోయావా బాబూ..
రాష్ట్రంలో విచ్చలవిడి అవినీతి...
ధర్మం గురించి చంద్రబాబు మాట్లాడటం సిగ్గుచేటు...
హైదరాబాద్ః ధర్మం గురించి చంద్రబాబు మాట్లాడటం విడ్డూరంగా ఉందని  వైయస్‌ఆర్‌సీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి విమ‌ర్శించారు. అధికారం కోసం చంద్ర‌బాబు ఎవ‌రితోనైనా క‌లుస్తార‌ని, ఎందాకైనా తెగిస్తార‌ని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని  వైయస్‌ఆర్‌సీపీ కేంద్రకార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పరిపాలనను చంద్ర‌బాబు భ్రష్టు పట్టించారని మండిప‌డ్డారు. ధ‌ర్మపోరాట దీక్షలు టీడీపీ కార్యక్రమాలుగా మారిపోయాయని విమ‌ర్శించారు. రాష్ట్రంలో అధికారులు టీడీపీ నాయకులు,కార్యకర్తల చెప్పుచేతల్లో పనిచేస్తున్నారన్నారు. జన్మభూమి కమిటీలను పెట్టి వ్యవస్థను నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఒక సామాన్యుడికి రేషన్‌కార్డు రావాలంటే జన్మభూమి కమిటీకి లంచమిచ్చి అనుమతి పొందాల్సిన పరిస్థితి ఉందని, ఇల్లు మంజూరుకు  జన్మభూమి కమిటీ  సంతకం కావాలంటే 25 వేల నుంచి రూ. 50వేల నుంచి ముడుపులు ఇవ్వనిదే  అన్నారు.  వృద్ధాప్య పింఛన్‌కు కూడా మూడువేల రూపాయలు లంచం వసూలు చేస్తున్నారన్నారు. బీసీ,ఎస్టీ,ఎస్సీ,కాపు కార్పొరేషన్‌ల నుంచి ఆర్థిక సాయం  కావాలంటే ముడుపులు చెల్లించుకోవలసి వస్తోందని దుయ్యబట్టారు. కేంద్రం సాయంతో వచ్చే వ్యక్తిగత మరుగుదొడ్లకు కూడా లంచం వసూలు చేయడం సిగ్గుచేటన్నారు.

రాష్ట్రంలో గ్రామీణ స్థాయి నుంచి రాజధాని వరుకూ ఇష్టారాజ్యంగా అవినీతి విచ్చలవిడిగా సాగుతున్నారు. రాజధాని భూముల విషయంలో ప్రైవేటు వ్యక్తులకు ఎకరాకు 50 లక్షలకు ప్రభుత్వానికి ఎకరా రూ. 4 కోట్లు  ఇష్టారాజ్యంగా కేటాయింపులు చేస్తున్నారని విమర్శించారు. రోడ్లకు 12 కోట్ల నుంచి 30 కోట్ల రూపాయాలకు కేటాయించారని స్వర్గానికైమేనా రోడ్లు వేస్తున్నారా అని ప్రశ్నించారు. ఇరిగేషన్,  రోడ్లు, భవన నిర్మాణాల్లో విచ్చలవిడిగా బినామీ సంస్థలకు కేటాయింపులు చేశారన్నారు.రాష్ట్రంలో ఇసుక దోపిడీ, వైన్ షాపులో సిండికేట్‌ల రాజ్యం, చంద్రన్నకానుకలో బెల్లంలో కూడా అవినీతికి పాల్పడుతున్నార‌ని ఆరోపించారు. శాంతిభద్రతలను కాపాడ‌వ‌ల‌సిన ప్రభుత్వం  వైయస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై కక్షసాధింపు చర్యలకు దిగుతుందన్నారు. ఎస్సీ,ఎస్టీ కేసులు. నాన్‌ బెయిలబుల్‌ కేసులతో భయపెడుతున్నారన్నారు.  కాల్‌మనీ, సెక్స్‌రాకెట్‌లో మహిళలకు ఏం న్యాయం చేశారని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగులకు రక్షణ లేదన్నారు. 
తహశీల్దార్‌  వనజాక్షి దాడి జరిగితే ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. 

ప్రతిపక్ష నేత  వైయస్‌ జగన్‌పై దాడి జరిగితే నవ్వుకుంటూ వెకిలి చేష్టలు చేస్తున్నారన్నారన్నారు. థర్డ్‌ పార్టీ విచారణ ఎందుకు చేయించడంలేదో  చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. ప్రత్యేకహోదాపై ప్రతిపక్షం పోరాడితే అణచివేత చర్యలకు టీడీపీ ప్రభుత్వం పాల్పడిందన్నారు. వైయస్‌ఆర్‌సీపీ నాయకులపై అన్యాయంగా కేసులు పెట్టి. మీరు పోరాటం గురించి మాట్లాడటం సిగ్గు చేటన్నారు. గతంలో కాంగ్రెస్‌ పార్టీపై చంద్రబాబు అనేక వ్యాఖ్యలు చేశారన్నారు. ‘తెలుగుజాతిని చంపుతున్న సోనియా గాడ్సే, ఇటలీ మాఫియాను తెచ్చారు. ఆమెకు మన సంస్కృతి తెలియదు, రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారు, ప్రధాని రజనీకాంత్‌ రోబోలా  రబ్బర్‌స్టాంప్‌లా మారిపోయారు, సోనియా అవినీతి అనకొండ..వాద్రా మాత్రం పిల్ల అనకొండ...కాంగ్రెస్‌ను గెలిపిస్తే ఊరికో అవినీతి అనకొండ..ఆ దేశ ద్రోహులపై సానుభూతి చూపొద్దు.. విభజించి మన పొట్టకొట్టారు’ అంటూ చంద్ర‌బాబు గ‌తంలో తీవ్ర విమర్శలు చేశారని గుర్తుచేశారు. ఇప్పుడు అదే కాంగ్రెస్‌తో చేతులు కలుపుతున్నారని గుర్తు చేశారు. ప్రత్యేకహోదా రాక పోవడానికి కాంగ్రెస్సే కారణమని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు వారితో కలవడం సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించారు.

Back to Top