టీడీపీ పాలనలో ప్రజలకు అష్టకష్టాలు..

పేదలను అప్పులపాలు చేసిన ఘనత చంద్రబాబుది..
వైయస్‌ఆర్‌సీపీ నేత పార్థసారధి
విజయవాడః చ్రరితలో ఏ ముఖ్యమంత్రి మోసం చేయని విధంగా చంద్రబాబు రాష్ట్ర ప్రజలను మోసం చేశారని వైయస్‌ఆర్‌సీపీ నేత పార్థసారధి ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో వైయస్‌ఆర్‌సీపీ నేత పార్థసారధి ఆధ్వర్యంలో వైయస్‌ జగన్‌ పాదయాత్రకు మద్దతుగా  సంఘీభావ యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రుణాలు మాఫీ చేశానని చెప్పి మాధ్యమాల్లో ప్రచారం చేసుకుంటూ.. అసెంబ్లీలో మాఫీ చేయలేదని, మాఫీ చేసే ఆలోచన లేదని చెప్పడం సిగ్గుచేటన్నారు. ప్రత్యేకహోదాను అవహేళన చేసిన చంద్రబాబు..ప్రత్యేకహోదా కోసం పోరాటం చేస్తున్నామని ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు..కూర్చి కోసం ఇచ్చిన హామీలు,వాగ్దానాలు ఒకటి కూడా సంతృప్తిగా అమలు చేయలేదని ఆరోపించారు.  పేదవారికి అన్నివిధాల నష్టం కలిగించారని విమర్శించారు. ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పి పేదల నుంచి లక్షలు వసూలు చేసి అప్పులపాలు చేశారన్నారు. జగన్‌మోహన్‌ రెడ్డి పాదయాత్ర రాష్ట్ర ప్రజల్లో భరోసా కల్పించారన్నారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి  రాష్ట్ర ప్రజల సమస్యలకు ఒక పరిష్కారం చూపించారని,  ఆయన తనయుడు వైయస్‌ జగన్‌ కూడా పరిష్కారం చూపిస్తారనే నమ్మకంతో ప్రజలు ఉన్నారన్నారు. యువత, మహిళలు,రైతులు, నిరుద్యోగులు అంతా జగన్‌మోహన్‌రెడ్డి పాలన కోసం ఎదురుచూస్తున్నారన్నారు.
Back to Top