<br/>శ్రీకాకుళం: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర మంతి కళా వెంకట్రావ్ అక్రమాలకు అంతే లేదని వైయస్‌ఆర్‌సీపీ ఎచ్చెర్ల నియోజకవర్గ సమన్వయకర్త కిరణ్ విమర్శించారు. చిలకపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ..వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చాక ప్రజలకు చేసే మేలులు వివరిస్తున్నారని చెప్పారు. మన నియోజకవర్గంలో మంత్రి కళా వెంకట్రావ్ పరిస్థితి అందరికి తెలిసిందే అన్నారు. టీడీపీకి ఓట్లు వేసిన వారికి కూడా దూరంగా ఉన్నారన్నారు. నీరు– చెట్టు పేరుతో దోచుకుంటున్నారని విమర్శించారు. ఒక ఫ్యాక్టరీ పెట్టుకోవాలంటే ప్రభుత్వ జాగా ఇవ్వడం లేదన్నారు. కళా వెంకట్రావ్ కుమారుడు ఫ్యాక్టరీ పెట్టుకుంటే కేవలం రూ. 2.10 లక్షలకే అప్పగించారన్నారు. జన్మభూమి కమిటీలతో ప్రజలకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. కళా వెంకట్రావ్ ఏ ఒక్కరికీ అందుబాటులో లేరన్నారు. వైయస్ జగన్ నాయకత్వాన్ని కోరుతున్నారని, ఈ రోజు టీడీపీ చేస్తున్న భూదందాలు, అవినీతి అక్రమాలతో ప్రజలు విసికెక్కిపోయారన్నారు. కుడి కాల్వ ఆధునీకీకరణ పనులు టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. నారాయణసాగరంను మినీ రిజర్వాయర్‌గా చేయాలని వైయస్ జగన్‌ను కోరారు. మన నియోజకవర్గంలోని 20 ఫ్యాక్టరీలలో స్థానికులకు అవకాశం కల్పించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కిరణ్ వైయస్ జగన్‌ను కోరారు. కార్మికులకు ఈఎస్‌ఐ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.