నారా రహిత పాలన రావాలి

రాష్ట్ర్రంలో నారా రహిత పాలన వచ్చినప్పుడే సారా రహిత పాలన వస్తుందని వైయస్‌ఆర్‌సీపీ నాయకురాలు వరుదు కల్యాణి అన్నారు. చంద్రబాబు వస్తే కరువు వచ్చిందన్నారు. మళ్లీ వస్తే అన్నపూర్ణగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌  ఆఫ్రికాగా మారిపోతుందన్నారు. రుణమాఫీ చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని ఇప్పుడు రుణమే దొరకని పరిస్థితి ఉందన్నారు. బంగారం ఇంటికి నడిస్తుందన్నారని తాళిబొట్టు కూడా తాకట్టు పెటాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఆడవారిని అల్లరిచేస్తే ఐదు నిమిషాల్లో తాట తీస్తానని చెప్పిన చంద్రబాబు పెందుర్తి నియోజకవర్గంలోనే తెలుగుదేశం నేతలు దళిత మహిళలను వివస్త్రను చేసి దాడిచేస్తే  ఏంచేశారని ప్రశ్నించారు. ప్రత్యేకహోదా రప్పిస్తానని ప్యాకేజీకి అమ్ముడుపోయారన్నారు. 2014 ఎన్నికల సమయంలో బాహుబలి సినిమా చూపిస్తానన్న చంద్రబాబు ఇప్పుడు బ్రహ్మనందం సినిమా  చూపిస్తారన్నారు..జగనన్న పాలన కోసం రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు.
Back to Top