కాకినాడః కాకినాడ చ్రరితలో కొండబాబు లాంటి అవినీతిపరుడ్ని చూడలేదని వైయస్‌ఆర్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. ఎమ్మె ల్యే కొండబాబు అబద్ధాలతో పాటు నటన కూడా నేర్చారన్నారు. కొండబాబు ప్రధాన అనుచరుడు ఆయిల్ మాఫియాలో పట్టుబడ్డాడని, రూ.100 కోట్ల ఆయిల్ స్కాంలో రూ.50 కోట్లు కొండబాబుకు ముట్టాయని ఆరోపించారు. పేకాటక్లబ్‌లు, సింగిల్ నంబర్ లాటరీ, గుట్కా వ్యాపారుల నుంచి మామూళ్లు వసూలు చేస్తున్నారన్నారు. పోలీసు,మున్సిపల్ అధికారుల బదిలీల్లో కొండబాబుకు ముడుపులు దండుకుంటున్నారన్నారు.