తిత్లీ తుపాన్‌పై కేంద్రం ఉదారంగా సాయం చేయాలి

ఢిల్లీః ఏపీ పోలీసుల విచారణపై సందేహాలున్నాయని వైయస్‌ఆర్‌సీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖ ఎయిర్‌పోర్టులో ఏపీ ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసు మాకు సంబంధం లేదు కేంద్రం పరిధిలో ఉందంటూ చంద్రబాబు మాట్లాడిన తీరును హోంమంత్రికి వివరించామన్నారు. రాజ్‌నాథ్‌ సింగ్‌  స్పందించి ఈ ఘటనపై చర్చించి సమగ్ర విచారణ చేస్తామన్నారని తెలిపారు. తిత్లీ తుపాన్‌పై కూడా కేంద్రం ఉదారంగా స్పందించి సాయం చేయాలని కోరినట్లు తెలిపారు. దానికి కూడా రాజ్‌నాథ్‌ సానుకూలంగా స్పందించారన్నారు.
 

తాజా వీడియోలు

Back to Top