నిందితుడికి ప్రాణహాని జరిగితే పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే...

సాక్ష్యాన్ని సమాధి చేయడానికి టీడీపీ పన్నాంగం..
వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ
ఢిల్లీః ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై హత్యాయత్నం కేసులో సాక్ష్యాన్ని పూర్తిగా సమాధి చేయడానికి టీడీపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని వైయస్‌ఆర్‌సీపీ నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు.  నిందితుడు శ్రీనివాస్‌ తనకు  ప్రాణహాని ఉందని స్వయంగా చెప్పాడని కేంద్రం ప్రభుత్వం రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేశారు.  తక్షణమే థర్డ్‌ పార్టీ విచారణ జరిపించాలన్నారు. నిందితుడికి ప్రాణహాని జరిగితే పూర్తి బాధ్యత టీడీపీ ప్రభుత్వానిదేనన్నారు. సుమారు నాలుగురోజుల నుంచి నిందితుడి సిట్‌ బృందం విచారణ చేస్తున్నా  సమాచారాన్ని రాబట్టలేదన్నారు. హత్యాయత్నంలో చంద్రబాబు,లోకేష్, టీడీపీ పెద్దలకు సంబ«ం«ధాలున్నాయని తెలిపారు.  నిందితుడి విచారణ చేస్తున్న తీరు బట్టి వాస్తవం తేటతెల్లమవుతుందన్నారు.
 
Back to Top