ఊరించి ఉసురు తీయడమే బాబు నైజం

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి
శ్రీకాకుళం: చంద్రబాబు నిరుద్యోగ యువతను ఊరించి ఉసురు తీస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. నాలుగున్నరేళ్లుగా నిరుద్యోగులను మోసం చేస్తూ ఎన్నికలు దగ్గరపడ్డాయని డీఎస్సీ పేరుతో మారోమారు మోసం చేయాలని చూస్తున్నాడన్నారు. శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్న ప్రజా సంకల్పయాత్రలో భూమన కరుణాకర్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను మళ్లీ మోసం చేస్తున్నారని, రాష్ట్రంలో 26 వేల టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉంటే 7 వేల పోస్టులను మాత్రమే భర్తీ చేయడమంటే ఊరించి ఉసురు తీయడమేనన్నారు. నాలుగేళ్లు నిర్లక్ష్యం చేసి ఇప్పుడు అరకొరగా భర్తీ చేస్తున్నారన్నారు. నిరుద్యోగ భృతిలో యువతను మోసం చేసినట్లే ఇప్పుడు డీఎస్సీ అభ్యర్థులను మోసం చేస్తాడన్నారు.  చంద్రబాబు నక్కజిత్తులు నమ్మి యువత మోసపోవద్దన్నారు. 
 
Back to Top