వైయస్‌ జగన్‌పై హత్యాయత్నం ముమ్మూటికీ చంద్రబాబు కుట్రే..

తిరుపతిః వైయస్‌ జగన్‌పై హత్యాయత్నం ఘటన ముమ్మాటికీ చంద్రబాబు కుట్రే అని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత భూమన కరుణాకర్‌ రెడ్డి అన్నారు.  జగన్‌కు తుదముట్టించడానికి ప్రయత్నించారన్నారు.  అదృష్టవశాత్తు జగన్‌ ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారన్నారు. జగన్‌ లభిస్తున్న ఆదరణను చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విచారణలో వాస్తవాలు బయటకు రావని, అందుకే థర్డ్‌ పార్టీతో విచారణ జరిపించాలని కోరుతున్నామన్నారు. చంద్రబాబుకు మానవత్వం లేదన్నారు. అలిపిరి వద్ద చంద్రబాబుపై దాడి జరిగితే వైయస్‌ఆర్‌ చంద్రబాబును పరామర్శించడమే కాకుండా దీక్ష కూడా చేశారని గుర్తు చేశారు. చంద్రబాబు జగన్‌ను పరామర్శించకుండా ఆయనమీదే నిందలు మోపారన్నారు.
 
Back to Top