విజయనగరంః రాజకీయ ప్రత్యర్థులను మట్టుబెట్టే సంస్కృతికి పునాది వేసిన ఘనత చంద్రబాబుదే అని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. పోలీసుల అమరవీరుల సభలో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలను ఖండించారు. వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తలను గూండాలుగా చిత్రీకరించడం దారుణమన్నారు. రక్తంతో చేతులు తడుపుకునే చంద్రబాబు రాష్ట్రంలో రౌడీలకు స్థానం లేదని సమర్థించుకోవడం హిరణ్యకశిపుడు హరినామ స్మరణ చేసినట్లుగా ఉందని మండిపడ్డారు. చంద్రబాబు అండదండలతో రాష్ట్రంలో రౌడీలు స్వైరవిహారం చేస్తున్నారన్నారు. వంగవీటి మోహనరంగ హత్యవెనుక ప్రధాన భూమిక చంద్రబాబుదేనని మాజీ హోంమంత్రి హరిరామ జోగయ్య తన ఆత్మకథలో రాసుకున్నారని గుర్తుచేశారు. స్కూటర్‌పై వెళ్తున్న ఐఏఎస్ అధికారి రాఘవేంద్రరావును లారీతో ఢీకొట్టించి హత్యచేశారని చంద్రబాబుపై పలు ఆరోపణలు ఉన్నాయన్నారు. మల్లెల బాబ్జీ అనే ఎన్టీఆర్ అనుచరుడు హత్య వెనుక చంద్రబాబు హస్తం ఉందని అనుమానాలు వున్నాయన్నారు. వైయస్‌ఆర్ తండ్రి రాజారెడ్డి హంతకులకు చంద్రబాబు ఆశ్రయం ఇవ్వలేదా అన్ని ప్రశ్నించారు. అనంతపురంలో జరుగుతున్న హత్యలకు కారణం ఎవరని ప్రశ్నించారు. గతంలో చంద్రబాబు 9 సంవత్సరాల పాలనలో 470 మంది హత్యకు గురయ్యారని ఒక కేసు కూడా నమోదు కాకుండా రాజకీయ ప్రత్యర్థులను మట్టుబెట్టారని ఆరోపించారు.. తునిలో రత్నాచల్ రైలు దహనం కేసుల్లో నిందితులను ఎందుకు అరెస్ట్ చేయించలేకపోయారని కారణం. తెలుగుదేశం కార్యకర్తలు అందులో ఉన్నారన్నారు. చంద్రబాబు ఆదేశంతోనే రైలును దహనం చేశారని అందుకే దోషులు ఇప్పటి వరుకూ బయటకు రాలేదన్నారు. ప్రత్యేకహోదాపై విశాఖలో శాంతియుతంగా ర్యాలీ చేయడానికి వచ్చిన ప్రతి పక్షనాయుకుడిని అనుమతించకుండా ఎయిర్‌పోర్ట్ నుంచే పంపించివేసిన చంద్రబాబు.. పారిశ్రామిక సదస్సును వైయస్‌ఆర్‌సీపీ అడ్డకుంటుందని ప్రచారం చేయడం దారుణమన్నారు. ఎన్టీఆర్‌పై చెప్పలు వేయించిన ఘన చరిత్ర ఉన్న చంద్రబాబు నీతివాక్యాలు వల్లించడం సిగ్గుచేటన్నారు.శ్రీకాకుళం జిల్లాలో తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు అష్టకష్టాలు పడుతుంటే వారికి కనీసం తాగునీరు కూడా ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం అని దుయ్యబట్టారు.