చంద్రబాబు వ్యాఖ్యలు అమానుషం

వైయస్‌ జగన్‌ను ఎదుర్కోలేకే  ఆరోపణలు
కిడారి హత్యకు చంద్రబాబే కారణం
వైయస్‌ఆర్‌సీపీ నేత భూమన కరుణాకర్‌ రెడ్డి
విజయనగరంః ఒక ఎమ్మెల్యేకు రక్షణ కల్పించలేని తన అసమర్థతను  కప్పిపుచ్చుకునేందుకు  చంద్రబాబు దుర్మార్గమైన ఆరోపణలను వైయస్‌ఆర్‌సీపీ నేత భూమన కరుణాకర్‌ రెడ్డి ఖండించారు. ప్రజా సంకల్పయాత్రకు వస్తున్న ఆదరణ చూసి చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు.  జగన్‌ను ఎలా ఎదుర్కోవాలో తెలియక బురదచల్లుతున్నారని విమర్శించారు.  కిడారి హత్యపై చంద్రబాబు వ్యాఖ్యలు అమానుషమన్నారు. ఓటమి భయంతోనే చంద్రబాబు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు.  ఏజెన్సీలో మైనింగ్‌కు చంద్రబాబు ఏర్పచిన దారులే కిడారి హత్యకు కారణమన్నారు. హత్య తర్వాత కనీసం అంబులెన్స్‌లో కూడా పంపించలేని దిక్కుమాలిన పాలన చంద్రబాబుది అని దుయ్యబట్టారు. జననేత వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పాదం  తెలుగుదేశం పార్టీ కంచుకోట ఉత్తరాంధ్రలో పాదమోపగానే బీటలు వారిందన్నారు.  3వేల కిలోమీటర్లు మైలురాయి ఉత్తరాంధ్రలో దాటడం, ప్రజల అత్యంత ఆదరాభిమానాలతో వైయస్‌ జగన్‌కు దక్కవడంతో టీడీపీలో పెద్ద ప్రకంపనలు కలుగుతున్నాయన్నారు తనను విభేదించినవారిపై బురదచల్లడం చంద్రబాబు నైజమని, ఆయన ఎదగుదలంతా అలాగే సాగిందన్నారు. వ్యవస్థలను తన పావులుగా మాత్రమే చంద్రబాబు వాడుకుంటున్నారని విమర్శించారు.
 
Back to Top