వాస్తవాలను వక్రీకరించారు..

పుష్కరాల ఘటనలో కలెక్టర్‌ ప్రాథమిక నివేదిక తుంగలో తొక్కారు..
వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌ రెడ్డి
తిరుపతిః గోదావరి పుష్కరాల ఘటనపై సోమయాజులు కమిషన్‌ నివేదిక దుర్మార్గంగా ఉందని వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌ రెడ్డి విమర్శించారు. వాస్తవాలను వక్రీకరించారన్నారు.  భక్తులు, మీడియాపై నిందులు వేయడం దారుణమని ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి నిజాలను మరుగుపరిచారన్నారు.. చంద్రబాబు ప్రచార యావ వల్లే 29 మంది చనిపోయారని, అప్పటి కలెక్టర్‌ ఇచ్చిన ప్రాథమిక నివేదికను కూడా పరిగణించలేదని ఆరోపించారు.
 
Back to Top