పచ్చ చొక్కాలకు ఇంధనం..ఎ్రర చందనం

- కోట్లు విలువైన ఎ్రరచందనాన్ని కొల్లగొడుతున్నారు
– ఎ్రరచందనం నాణ్యతను తగ్గించి చూపుతున్నారు
 
తిరుపతి: వచ్చే ఎన్నికల్లో ఎ్రరచందనమే ఇంధనంగా పచ్చ చొక్కాలు అడవుల్లో ఉన్న పచ్చధనాన్ని కొల్లగొడుతున్నారని భూమన కరుణాకర్‌రెడ్డి విమర్శించారు.  చంద్రబాబు పాలనలో స్మగ్లింగ్‌ పెరిగిపోయిందని,  టీడీపీ నాలుగున్నరేళ్ల పాలనలో పచ్చదండు అటవీ సందపను దోచుకుంటుందని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకులు భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎ్రర సైన్యం ఎ్రరచందనాన్ని 10 లక్షల ఎకరాల్లో మటుమాయం చేశారన్నారు. ఏ గ్రేడ్‌కు సంబంధించిన ఎ్రర చందనం టన్ను రూ.1.90 కోట్లు విలువ చేస్తుందన్నారు. నిత్యం చంద్రబాబుకు సంబంధించిన  వందల వాహనాల్లో ఎ్రరచందనాన్ని నిరాటకంగా రవాణా చేస్తున్నారని ఆరోపించారు.  ఆ నాడు కురుక్షేత్రంలో అశ్వర్థామ హతహ..కుంజహరహ అన్నట్లుగా చంద్రబాబు నాలుగున్నరేళ్ల క్రితం ఎ్రరచందనం స్మగ్లింగ్‌ జరుగకుండా చూస్తానని చెప్పారన్నారు. బాబు సీఎం అయ్యాక అటవీ సంపదను విచ్చలవిడిగా, నిస్సిగ్గుగా దోచుకుంటున్నారని విమర్శించారు. సీ గ్రేడ్‌కు చెందిన ఎ్రరచందనాన్ని వేలంలో పతాంజలి సంస్థ దక్కించుకుందని, దాన్ని డీఆర్‌ఐ సంస్థ పట్టుకుంటే ఏ గ్రేడ్‌ ఎ్రరచందనంగా తేలిందన్నారు. ఎ్రరచందనాన్ని ఇతర దేశాలకు తరలిస్తుందని కేంద్ర సంస్థ కనిపెట్టిందన్నారు. ఆంధ్ర రాష్ట్ర పరువును చంద్రబాబు బంగాళఖాతంలో కలిపారని ధ్వజమెత్తారు. పతాంజలి సంస్థలో మాత్రమే వారు పట్టుకున్న దొంగలని, రాష్ట్రంలో ఇప్పటికి 25 సార్లు ఈ ప్రభుత్వం ఎ్రరచందనం వేలం వేశారన్నారు. ఏ గ్రేడ్‌ను సీ గ్రేyŠ  ఎ్రరచందనం నాణ్యతను తగ్గించి వేలం వేస్తున్నారని తెలిపారు. వేలంలో చౌక ధరకు పాడుకుని ఇతర దేశౠలకు తరలిస్తున్నారని చెప్పారు. తమిళనాడులోని గిరిజన కూలీలను ఎ్రరచందనం కూలీలుగా పచ్చ నేతలు వాడుకుంటున్నారన్నారు. శేషాచలం, వెలుగొండ, పాలకొండ అడవుల్లో కూబింగ్‌ జరిపితే కనీసం నాలుగే వేల మంది కూలీలు నిరంతరం కొన్ని వేల ఎ్రరచందనం చెట్లను నరుకుతుంటారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో పచ్చ చొక్కాలకు ఇంధనం..ఎ్రర చందనమన్నారు. రుణమాఫీ కాదు..పచ్చధనాన్ని మాఫీ చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు అండదండలతో జరుగుతున్న దంద అని ధ్వజమెత్తారు. ఎ్రరస్మగ్లింగ్‌ను అడ్డుకుంటున్నట్లు తన ప్రచార మాధ్యమాలతో వీరుడు, సూరుడు అని ప్రచారం చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాంటీ రెడ్‌ శాండల్‌ టీమ్‌ను ఏర్పాటు చేసి రాయలసీమ ఐజీ పర్యవేక్షణలో, అటవీ అధికారులకు తుప్పు పట్టిన తుపాకులు ఇచ్చి, టాస్క్‌పోర్స్‌కు ఎలాంటి అధికారులు ఇవ్వలేదన్నారు. అడవుల్లో కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని షో చేశారని, అంతా తుస్‌ అని ఎద్దేవా చేశారు.  
 
Back to Top