కష్టాలు తీరాలంటే జననేత రావాలి..నేడు గజపతినగరంలో వైయస్ జగన్ బహిరంగ సభవైయస్ఆర్సీపీ సమన్వయకర్త బొత్స అప్పలనర్సయ్య..విజయనగరంః గజపతి నగరంలో నేడు జరిగే వైయస్ జగన్ బహిరంగ సభను విజయవంతం చేయాలని వైయస్‌ఆర్‌సీపీ గజపతినగరం నియోజకవర్గం సమన్వయకర్త బొత్స అప్పలనర్సయ్య పిలుపునిచ్చారు. నాలుగున్నరేళ్లలో టీడీపీ ప్రభుత్వాన్ని నమ్మి మోసపోయామని ప్రజలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారన్నారు. అర్హత ఉన్నా సంక్షేమ పథకాలు అందడంలేదని మహిళలు, వృద్ధులు,వికలాంగులు వైయస్ జగన్‌కు మొరపెట్టుకుంటున్నారన్నారు.అధికారంలోకి వచ్చిన తర్వాత వైయస్ జగన్‌మోహన్ రెడ్డి అమలు చేయబోయే నవరత్నాల పథకాలతో మా భవిష్యత్ బాగుంటుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారన్నారు. గజపతినగరం నియోజకవర్గంలో మూడు దశాబ్దాలుగా పైగా టీడీపీలో ఉన్న నేతలు వైయస్‌ఆర్‌సీపీలోకి చేరుతున్నారన్నారు. టీడీపీ ప్రభుత్వంలో అవినీతి పెరుగుపోయిందని,నేతలకు గౌరవం, గుర్తింపు టీడీపీ ఇవ్వడంలేదన్నారు. విసిగిపోయిన టీడీపీ నేతలు వైయస్‌ఆర్‌సీపీ ద్వారానే గుర్తింపు వస్తుందని భావించడం వలనే భారీఎత్తున ఇతర పార్టీల నేతలు వైయస్‌ఆర్‌సీపీలోకి చేరుతున్నారన్నారు. ఏ పని జరగాలన్నా లంచం ఇవ్వకపోతే జరగడంలేదన్నారు.నియోజకవర్గంలో సాగునీరు, తాగునీరు ఇబ్బందులు ఉన్నాయన్నారు. కనీసం రోడ్డు సౌకర్యం కూడా సరిగ్గా లేదన్నారు. వైయస్ జగన్ అధికారంలోకి వస్తే సమస్యలన్నీ తిరిపోతాయని ప్రజలు ఆశతో ఎదురుచూస్తున్నారన్నారు.